International yoga day: యోగా దినోత్సవ వేడుక.. చిత్ర మాలిక..!

భారత్‌ సహా అంతర్జాతీయంగా పలుదేశాలు నేడు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

Updated : 21 Jun 2022 13:58 IST

దిల్లీ: భారత్‌ సహా అంతర్జాతీయంగా పలుదేశాలు నేడు యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు సహా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిలో భాగంగా జరిగిన  కార్యక్రమాల్లో పాల్గొని యోగా ప్రాముఖ్యతను చాటారు. ‘యోగా భారత ప్రాచీన వారసత్వంలో ఒక భాగం. ఇది మానవాళికి భారత్‌ ఇచ్చిన బహుమతి. ఇది శరీరం, మనస్సు, ఆత్మను సమతుల్యం చేస్తుంది. అందుకే ఈ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, దాని ప్రయోజనాలను ప్రజలంతా పొందాలని కోరుతున్నాను’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ సూచించారు. ఆయన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. 

యోగా వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌

సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ

కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, ఎస్‌ జై శంకర్

లఖ్‌నవూలోని రాజ్‌భవన్‌ వద్ద యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌

 

దిబ్రూగఢ్‌లో యోగా కార్యక్రమంలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

భాజపా ఎంపీ, సినీనటుడు రవికిషన్

వైద్య సిబ్బందితో కలిసి యోగా దినోత్సవం జరుపుకొన్న భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌

యోగాసనాలు వేసిన క్రికెట్‌ లెజెండ్ మిథాలీ రాజ్‌

నేపాల్ రాజధాని ఖాట్మండూలో యోగా దినోత్సవంలో పాల్గొన్న వృద్ధురాలు

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని