Naresh: కంగ్రాట్స్‌ మహేశ్‌బాబు.. నరేశ్‌ ట్వీట్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు (Mahesh Babu) అభినందనలు తెలిపారు నటుడు నరేశ్‌ (Naresh). మహేశ్‌ నటించిన ‘ఒక్కడు’ రీ రిలీజ్‌ను ఉద్దేశిస్తూ నరేశ్‌ తాజాగా ట్వీట్‌  పెట్టారు. 

Published : 09 Jan 2023 13:15 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును (Mahesh Babu) ఉద్దేశిస్తూ నటుడు నరేశ్‌ (Naresh) ట్వీట్‌ చేశారు. ‘ఒక్కడు’ (Okkadu) రీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ మహేశ్‌, ఇతర బృందానికి అభినందనలు తెలిపారు. ‘‘‘ఒక్కడు’ విడుదలై 20 ఏళ్లు అయిన సందర్భంగా మహేశ్‌బాబు, నిర్మాత ఎం.ఎస్‌.రాజుతోపాటు టీమ్‌ మొత్తానికి నా అభినందనలు. ఒక సినిమాకు సంబంధించి 20 ఏళ్ల తర్వాత కూడా థియేటర్‌లో ప్రేక్షకులు ఈ విధంగా సందడి చేయడం చాలా అరుదు’’ అని నరేశ్‌ పేర్కొన్నారు.

టాలీవుడ్‌లో (Tollywood) గత కొంతకాలం నుంచి రీరిలీజ్‌ల (Movie Re Releases) హవా నడుస్తోన్న విషయం తెలిసిందే. అభిమానుల కోరిక మేరకు స్టార్‌ హీరోలు నటించిన ఒకప్పటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు ఆధునిక హంగులద్ది పలు థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అలా, ఇప్పటికే విడుదలైన ‘పోకిరి’, ‘జల్సా’, ‘తమ్ముడు’, ‘చెన్నకేశవ రెడ్డి’, ‘వర్షం’, ‘బిల్లా’, ‘ఖుషి’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ రాబట్టాయి. ఈనేపథ్యంలో జనవరి 7న తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘ఒక్కడు’ స్పెషల్‌ షోలు వేశారు. మహేశ్‌బాబు - భూమిక జంటగా నటించిన ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఫ్యాక్షనిజం, కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథ అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి.. మహేశ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని