Published : 04 Jul 2022 01:56 IST

Ante Sundaraniki: డేట్‌ సేవ్‌ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి

ఇంటర్నెట్‌ డెస్క్‌: మతాంతర వివాహం నేపథ్యంలో నాని (Nani) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ!’ (Ante Sundaraniki). ఈ రొమాంటిక్‌ కామెడీ సినిమా జులై 8 నుంచి ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లోకి రాబోతుందంటూ ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా చిత్ర బృందం వాటికి చెక్‌ పెట్టింది. ఈ చిత్రాన్ని జులై 10న విడుదల చేస్తున్నట్టు ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ‘‘సుందర్‌, లీల పెళ్లి కథ చూసేందుకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డేట్‌ సేవ్‌ చేసుకోండి. ‘అంటే.. సుందరానికీ!’ జులై 10న నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుంది’’ అని తెలిపింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్ల వేదికగా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలోని నాని (సుందర్‌), కథానాయిక నజ్రియా (లీల) నటన, దర్శకుడు వివేక్‌ ఆత్రేయ టేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. 

ఇదీ కథ: బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) అనే యువకుడు కుటుంబ ఆచారాలతో విసిగిపోతుంటాడు. అతనికి చిన్నతనం నుంచి లీల (నజ్రియా) అంటే ఇష్టం. ఇద్దరూ కలిసే చదువుకుంటారు. కెరీర్‌లో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకుంటారు. కానీ, సుందర్ తండ్రి శాస్త్రి (నరేష్), లీల తండ్రి థామస్ (అజగం పెరుమాళ్‌)కు వేరే మతం అంటే అస్సలు గిట్టదు. భిన్న కుటుంబ నేపథ్యాలు, మతాచారాల మధ్య ప్రేమికులుగా సుందర్, లీలా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ప్రేమను దక్కించుకునేందుకు వారు ఎలాంటి ప్లాన్స్ వేశారు? చివరికి ఎలా ఒక్కటయ్యారు? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని