Salman Khan: సల్మాన్‌ఖాన్‌ సోదరుడి రెండో వివాహం.. ఫొటోలు వైరల్‌

సల్మాన్ ఖాన్‌ (Salman Khan) సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ రెండో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

Updated : 25 Dec 2023 15:25 IST

ముంబయి: సల్మాన్‌ ఖాన్ (Salman khan) సోదరుడు అర్బాజ్‌ఖాన్‌ (Arbaaz Khan) రెండో వివాహం చేసుకున్నారు. సెలబ్రిటీ మేకప్‌ ఆర్టిస్ట్‌ షురా ఖాన్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని అర్బాజ్‌ సోదరి అర్పితా ఖాన్‌ నివాసంలో ఆదివారం రాత్రి ఈ పెళ్లి వేడుక జరిగింది. సల్మాన్‌ ఖాన్‌, కుటుంబసభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు. అర్బాజ్‌ వివాహం పట్ల సల్మాన్‌ ఆనందం వ్యక్తం చేశారు. బంధువులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Prithviraj: ‘సలార్‌’లో హింసాత్మక సన్నివేశాలు.. స్పందించిన పృథ్వీరాజ్‌

సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు అర్బాజ్‌ ఖాన్‌. ‘దరార్‌’తో తెరంగేట్రం చేసిన అర్బాజ్‌.. తొలి చిత్రంలోనే విలన్‌గా నటించి ప్రశంసలు అందుకున్నారు. ‘హలో బ్రదర్‌’, ‘సోచ్‌’, ‘కుచ్‌ నా కహో’, ‘హల్‌చల్‌’, ‘తాజ్‌మహల్‌’, ‘జై చిరంజీవ’, ‘ఓం శాంతి ఓం’, ‘గాడ్‌ ఫాదర్‌’, ‘ఫ్యాషన్‌’ ‘దబాంగ్‌’, వంటి చిత్రాల్లో ఆయన నటించారు. బాలీవుడ్‌లో నిర్మాతగానూ ఆయనకు పేరుంది. అర్బాజ్‌ 1998లో నటి మలైకా అరోరాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. పరస్పర అంగీకారంతో 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని