Karthikeya2: ‘బింబిసార’, ‘కార్తికేయ2’ ఓటీటీ విడుదలపై జీ5 రిప్లై..!

ప్రస్తుతం ఓ రెండు చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలో

Updated : 19 Sep 2022 16:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ఓ రెండు చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతాయా? అని ఉదయం, సాయంత్రం అప్‌డేట్‌లు వెతుకుతున్నారు. అవే ‘బింబిసార’ (Bimbisara) , ‘కార్తికేయ2’ (Karthikeya2) . ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలను అందుుకున్నాయి. ఎలాంటి హంగామా లేకుండా విడుదలైన ఈ రెండు విమర్శకులను సైతం మెప్పించాయి.

కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో ‘బింబిసార’ (bimbisara ott release) ఓ సరికొత్త ప్రయోగంగా నిలిచిపోయింది. ఇక ‘కార్తికేయ2’ (Karthikeya2 ott release) భాషా సరిహద్దులను చెరిపేసింది. చిన్న చిత్రంగా విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించింది. రూ.100కోట్ల క్లబ్‌ను దాటేసింది. ఇప్పటికీ ఉత్తరాదిలో మంచి వసూళ్లనే రాబడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తాయా? అని ఎదురు చూస్తున్న వాళ్లకు జీ5 సమాధానం ఇచ్చింది. ఈ సినిమాల గురించి వరుస సందేశాలు వెల్లువెత్తుండటంతో ‘మీ ఉత్సాహానికి సంతోషంగా ఉంది. దయచేసి వేచి ఉండండి. మరిన్ని వివరాలకు మా సోషల్‌మీడియా ఖాతాలను అనుసరించండి’ అని సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం సోషల్‌మీడియాలో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం. కల్యాణ్‌రామ్‌ ‘ బింబిసార’(bimbisara ott release)ను సెప్టెంబర్ 23న విడుదల చేసే అవకాశం ఉందని టాక్‌. అయితే, ఇప్పటివరకూ ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఈ డేట్‌ మిస్‌ అయితే, ఈనెల 30న స్ట్రీమింగ్‌కు కచ్చితంగా అందుబాటులోకి తెస్తారని అంటున్నారు. అలాగే, ‘కార్తికేయ2’(Karthikeya2 ott release) ను దసరా కానుకగా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అక్టోబరు 5 లేదా 7న స్ట్రీమింగ్‌కు తీసుకురావచ్చు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని