Chiranjeevi: ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’పై చిరంజీవి రివ్యూ..

అనుష్క శెట్టి - నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. ఈ సినిమాపై చిరంజీవి (Chiranjeevi)తన రివ్యూ పంచుకున్నారు.

Updated : 05 Sep 2023 16:02 IST

హైదరాబాద్‌: నవీన్‌ పొలిశెట్టి - అనుష్క శెట్టి (Anushka Shetty) నటిస్తోన్న సినిమా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. పి.మహేష్‌బాబు తెరకెక్కించిన ఈ చిత్రం మరో రెండురోజుల్లో (సెప్టెంబర్‌7) ప్రేక్షకుల ముందుకు రానుంది.  తాజాగా దీనిపై ప్రముఖ హీరో చిరంజీవి తన రివ్యూ తెలిపారు. సినిమాకు మొదటి ప్రేక్షకుడిని తానే అని చెప్పిన ఆయన రెండోసారి కూడా చూడాలనుందంటూ తన కోరికను బయటపెట్టారు.

ఈ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించిన చిరంజీవి ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty) మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకుంది. ఓ హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది తెరకెక్కింది. ఈ చిత్రం నేటి యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా సరికొత్త కథాంశంతో రూపొందింది. ఇక నవీన్‌ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’ కంటే రెట్టింపు వినోదాన్ని అందజేశారు. అలాగే కొంచెం గ్యాప్‌ తీసుకుని నటించిన అనుష్క ఈ సినిమాలో మరింత అందంగా కనిపించారు. మనందరి దేవసేన ఈ చిత్రానికి ప్రాణం పోశారు. సినిమాలో భావోద్వేగాన్ని బాగా చూపించారు. ఈ విషయంలో దర్శకుడు మహేశ్‌ బాబుని అభినందించాల్సిందే’’.

‘బాహుబలి’ తర్వాత పాకిస్థాన్‌లోనూ అలా పిలిచారు: సత్యరాజ్‌

‘‘ఈ సినిమాకు తొలి ప్రేక్షకుడిని నేనే. ఇందులోని ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఎంజాయ్‌ చేశా. థియేటర్లో విడుదలయ్యాక ప్రేక్షకులందరితో పాటు మరోసారి చూడాలనుంది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ఆడియన్స్‌ని వందశాతం నవ్వుల బాట పట్టిస్తుందనడంలో సందేహం లేదు’’ అంటూ చిత్రబృందానికి చిరంజీవి తన అభినందనలు తెలియజేశారు. వాళ్లతో ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు. ఇక ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన అనుష్క ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ‘మీ ఆశీర్వాదం మా టీమ్‌ అందరికీ ఎంతో ముఖ్యమైనది’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని