Rakshit Shetty: ఎన్టీఆర్‌ అంటే నాకెంతో ఇష్టం: రక్షిత్‌ శెట్టి

తన తదుపరి చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్‌ బి’ (sapta sagaradaache dati side b) ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు నటుడు రక్షిత్‌ శెట్టి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 12 Nov 2023 16:22 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ (NTR)ను తాను ఎంతగానో అభిమానిస్తున్నానని కన్నడ నటుడు రక్షిత్‌శెట్టి అన్నారు. ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా ఉంటుందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ‘‘నాకు ఎన్టీఆర్‌ అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. ఆయన నటించిన కొన్ని సినిమాలు చూశా. నటన, డైలాగ్‌ డెలివరీ అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా వెస్ట్రన్ డ్యాన్స్‌కు కూడా ఒకింత క్లాసికల్‌ టచ్‌ ఇస్తారాయన’’ అని పేర్కొన్నారు. అనంతరం తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. కాలేజీ చదివే రోజుల్లో సీనియర్‌ అంటే క్రష్‌ ఉండేది. ఆమెకు ఇప్పుడు పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు’’ అని రక్షిత్‌ తెలిపారు.

Tiger 3 Review: రివ్యూ: టైగర్‌-3.. సల్మాన్‌ నటించిన స్పై థ్రిల్లర్‌ హిట్టా..? ఫట్టా?

‘777 ఛార్లి’తో తెలుగువారికి చేరువయ్యారు రక్షిత్‌ శెట్టి. ఇటీవల ఆయన నటించిన చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్‌ ఎ’. హేమంత్ ఎం రావు దర్శకుడు. విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈసినిమాలో రక్షిత్‌శెట్టికు జంటగా రుక్మిణీ వసంత్ నటించారు.  సెప్టెంబర్‌ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతటా మంచి టాక్‌ అందుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ బి’ సిద్ధమైన విషయం తెలిసిందే. నవంబర్‌ 17న ఇది విడుదల కానుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఇది తెలుగులో విడుదలవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని