Oscar Award: ‘ఆస్కార్’ విజేతలకు నగదు ఇస్తారా? అవార్డు బరువెంత?
95వ ఆస్కార్ వేడుకలు భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు గురించి కొన్ని విశేషాలు చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచమంతా ప్రస్తుతం ‘ఆస్కార్’ (Oscar) గురించే మాట్లాడుతోంది. విజేతలకు శుభాకాంక్షలు చెబుతూనే.. వారికి అవార్డుతోపాటు నగదు ఎంత ఇస్తారు? దాన్ని దేనితో తయారు చేస్తారు? అంటూ చర్చిస్తోంది. ఆ విశేషాలతోపాటు ఆస్కార్ ప్రస్థానాన్ని ఓసారి చూద్దాం (Oscar Awards 2023)..
- ఆస్కార్ విజేతలకు ట్రోఫీని మాత్రమే అందిస్తారు. ప్రత్యేకంగా నగదు ఇవ్వరు. కానీ, ‘ఆస్కార్ గ్రహీత’ అనే పేరే ఆయా నటులు, టెక్నిషియన్లకు ఎన్నో అవకాశాలు తెచ్చిపెడుతుంది. వారు పనిచేసే ప్రతి సినిమాకూ ప్రపంచవ్యాప్తంగా విశేష క్రేజ్ లభిస్తుంది. తమ కెరీర్ రూపురేఖలే మారిపోతాయి. అంతటి మ్యాజిక్ ఉంది ఆస్కార్‌లో. అందుకే జీవితంలో ఒక్కసారైనా దాన్ని సొంతం చేసుకోవాలని చిత్ర పరిశ్రమ వారంతా కలలు కంటుంటారు.
- అకాడమీ నిబంధనల ప్రకారం ట్రోఫీని విక్రయించడం, పడేయడంలాంటివి చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవార్డు దక్కించుకున్న వారెవరైనా దాన్ని తిరస్కరిస్తే అకాడమీనే ఒక డాలర్ ఇచ్చి వెనక్కి తీసుకుంటుంది. అంతటి పురస్కారాన్ని వద్దనుకునేవారూ ఉంటారా? అనే సందేహం మీకు రావొచ్చు. పలు కారణాల వల్ల కొందరు తమకు ఎంపికైన అవార్డును తిరస్కరిస్తారు. ‘ది గాడ్‌ఫాదర్’ ఫేం మార్లొన్ బ్రాండో వారిలో ఒకరు. ఆస్కార్‌కు నామినేట్ అయిన వారికి అకాడమీ కొన్ని బహుమతులను అందిస్తుంది.
- హాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులతో కూడిన 5 విభాగాలతో 1927లో ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ’ ఏర్పడింది. అదే 1929 నుంచి చలన చిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’ పేరిట పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత, వీటిని ఆస్కార్ పురస్కారాలుగా పిలవడం మొదలైంది. ఆస్కార్ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునేముందు ఆ అవార్డు ఎలా రూపొందిందో చూద్దాం.
- ఆస్కార్ అవార్డు.. కాంతులీనే పసిడి వర్ణంతో, ఓ యోధుడు రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టి ఫిల్మ్ రీలుపై ఠీవీగా నిల్చొన్నట్టు కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఎంజీఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ సృష్టించారు.
- అవార్డు కింది భాగంలోని రీలు చుట్టులో 5 చువ్వలుంటాయి. అకాడమీలోని 5 విభాగాలకు అవి సూచికలు. ఎమిలో ఫెర్నాండెజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతడి ఆకారం నుంచి స్ఫూర్తిపొంది.. గిబ్బన్స్ ఈ నమూనాను రూపొందించారట. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా కనిపిస్తుంది.
- ప్రతిమ నమూనా రూపొందాక దానికనుగుణంగా త్రీ డైమెన్షన్స్ ప్రతిమను తయారు చేసే పనిని లాస్ ఏంజెల్స్‌కు చెందిన ప్రసిద్ధ శిల్పి జార్జ్ స్టాన్లీ భుజానికెత్తుకున్నారు. కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ల బంగారు పూత అద్దిన.. 13.5 అంగుళాల ఎత్తు, 8.5 పౌండ్ల (సుమారు 4 కిలోలు) బరువున్న ఆస్కార్ ట్రోఫీ స్టాన్లీ చేతుల్లో పురుడు పోసుకుంది.
- ఈ ప్రతిమ ఆధారంగా షికాగోలోని ఆర్.ఎస్. ఓవెన్స్ అండ్ కంపెనీ ఆధ్వర్యంలో ఏటా ఆస్కార్ అవార్డులను తయారు చేస్తారు. ఒక్కో ఆస్కార్ ట్రోఫీ తయారీకి 400 డాలర్లు ఖర్చవుతుందని అంచనా.
- ఈ పురస్కారాలకు ఆస్కార్ అని పేరు రావడం వెనక ఓ ప్రచారం ఉంది. తొలిసారి ఆ ట్రోఫీని చూసిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్.. అందులోని యోధుడు అచ్చం తన అంకుల్ ఆస్కార్‌లా ఉన్నాడని అన్నారట. ఆ తర్వాత హాలీవుడ్ కాలమిస్ట్ సిడ్నీ స్కోల్‌స్కీ తన వ్యాసంలో వీటిని ఆస్కార్ పురస్కారాలని ప్రస్తావించారట. అలా ‘ఆస్కార్’ వాడుకలోకి వచ్చింది.
- 1929లో ప్రారంభమైన ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం ఈ ఏడాదితో 95 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది.. భారతదేశం నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) ఆస్కార్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ అకాడమీ 3,140కిపైగా అవార్డులు ప్రదానం చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Chandigarh University: పరీక్షలో పాటలే సమాధానాలు.. లెక్చరర్ కామెంట్‌కు నవ్వులే నవ్వులు
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో!
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Movies News
Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!