పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్‌ హీరో

తన తదుపరి చిత్రం ‘ఇరైవన్‌’ (Iraivan)ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు జయం రవి. తన చిత్రాన్ని పిల్లలతో కలిసి చూడొద్దని కోరారు.

Published : 25 Sep 2023 18:11 IST

చెన్నై: నయనతార (Nayanthara), జయం రవి(Jayamravi) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇరైవన్‌’ (Iraivan). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘గాడ్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. క్రైమ్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జయం రవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ చిత్రానికి సెన్సార్ బోర్డ్‌ ‘ఎ’ సర్టిఫికేట్‌ ఇవ్వడంపై మాట్లాడారు.

‘‘అన్ని వయసుల ప్రేక్షకులకు వినోదాన్ని అందించేలా నేను తరచూ సినిమాలు చేస్తుంటా. కాకపోతే ‘ఇరైవన్‌’ చిత్రాన్ని మాత్రం పిల్లలతో కలిసి చూడొద్దు. ఎందుకంటే, ఇది ‘ఏ’ సర్టిఫికేట్‌ చిత్రం. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు పిల్లలు భయపడే అవకాశం ఉంది. మా సినిమా ఎలా ఉండనుందో ట్రైలర్‌తో పరిచయం చేశాం. ఇలాంటి జోనర్‌ చిత్రాలను కొంతమంది ఇష్టపడతారు. వాళ్లు తప్పకుండా సపోర్ట్‌ చేస్తారనుకుంటున్నా’’ అని ఆయన చెప్పారు.

సెప్టెంబరు ఆఖరివారం.. అలరించే చిత్రాలివే.. మరి ఓటీటీలో..?

అనంతరం లోకేశ్‌ కనగరాజ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘లోకేశ్‌ కనగరాజు గతంలో నాకొక కథ చెప్పారు. కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. అతడు గొప్ప దర్శకుడు. అతడు మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా. ఇక, నాక్కూడా డైరెక్షన్‌ వైపు వెళ్లాలనే ఆశ ఉంది. భవిష్యత్తులో అవకాశం వస్తే విజయ్‌ సేతుపతిని హీరోగా పెట్టి సినిమా చేస్తా’’ అని ఆయన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని