July Movies: ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌ మరో స్థాయిలో.. జులైలో సందడి చేసే సినిమాలివే

Movies Releasing in July: జులై నెలలో దేశవ్యాప్తంగా విడుదల కానున్న సినిమాలు ఏమిటంటే..? 

Updated : 01 Jul 2023 13:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2023 ప్రథమార్ధంలో పాన్‌ ఇండియా చిత్రాలు, తక్కువ బడ్జెట్‌తో రూపొందిన కథా బలమున్న సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ద్వితీయార్ధంలోనూ స్టార్‌, యువ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జులైలో థియేటర్లలో సందడి చేయడానికి సినిమాలు వరుస కట్టాయి. మరి, ఏ రోజు ఏ సినిమా విడుదల కానుందో చూద్దాం.

07-07-2023

  • రంగబలి: నాగ శౌర్య హీరోగా దర్శకుడు పవన్‌ బాసంశెట్టి తెరకెక్కించిన సినిమా ఇది. యుక్తి తరేజా కథానాయిక. యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైంది.
  • భాగ్‌సాలే: శ్రీ సింహా కోడూరి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నేహా సోలంకి కథానాయిక. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించారు.
  • రుద్రంగి: జగపతిబాబు, ఆశిష్‌ గాంధీ, గానవి లక్ష్మణ్‌, విమలా రామన్‌, మమతా మోహన్‌దాస్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్‌ నిర్మాత. అజయ్‌ సామ్రాట్‌ దర్శకుడు. యాక్షన్‌, పీరియాడికల్‌ డ్రామాగా సిద్ధమైంది. 
  • 7:11 PM: ఫ్యూరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సాహస్‌, దీపిక జంటగా నటించారు. చైతు మాదాల దర్శకత్వం వహించారు. 
  • సర్కిల్‌: నీలకంఠ రూపొందించిన ఈ సినిమాలో సాయి రోనక్‌, బాబా భాస్కర్‌, అర్షిణ్‌ మెహతా, రిచా పనై, నైనా ప్రధాన పాత్రలు పోషించారు.
  • ఓ సాథియా: దర్శకురాలు దివ్యభావన తెరకెక్కించిన సినిమా ఇది. ఆర్యన్‌ గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా నటించారు.
  • ఇద్దరు (తమిళం - తెలుగు): అర్జున్‌, జెడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎస్‌.ఎస్‌.సమీర్‌ తెరకెక్కించిన చిత్రమిది.
  • పద్మిణి (మలయాళం): కుంచకో బోబన్, మడోన్నా సెబాస్టియన్, అపర్ణ బాలమురళీ ప్రధాన పాత్రలుగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కామెడీ డ్రామాను సెన్నా హెగ్డే తెరకెక్కించారు.
  • బంపర్‌ (మలయాళం): వెట్రి సడ్లే, శివానీ నారాయణన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సెల్వకుమార్‌ దర్శకత్వం వహించారు. యాక్షన్‌, కామెడీ డ్రామాగా సిద్ధమైంది.
  • నీయత్‌ (హిందీ): విద్యా బాలన్‌, రామ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కు అనూ మేనన్‌ దర్శకత్వం వహించారు.
  • హత్య (కన్నడ): హ్యారీ జోష్, కోమికా ఆంచల్‌ పాత్రధారులుగా వరుణ్‌ తెరకెక్కించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ హత్య. 

08-07-2023

  • యే మేరా రివెంజ్‌: అనుపమ్‌ ఖేర్‌, శక్తి కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. ఇక్బాల్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు.

12-07-2023

  • ఘోస్ట్‌: కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. శ్రీని దర్శకుడు.

14-07-2023

  • బేబీ: ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించారు.
  • మా వీరన్‌ (తమిళం - తెలుగు): శివ కార్తికేయన్‌, అదితి శంకర్‌ జంటగా నటించిన సినిమా ఇది. మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో ‘మహా వీరుడు’ పేరుతో విడుదల కానుంది.
  • నమస్తే ఘోస్ట్‌ (కన్నడ): భరత్‌ నందా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్‌ కామెడీలో విద్యా రాజ్‌ కథానాయిక.
  • దామాయణ (కన్నడ): శ్రీముఖ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమాలో ఆదిత్య, అక్షయ్‌ వంటి యువ నటులు కీలకపాత్ర పోషించారు.
  • అజ్మెర్‌ 92 (హిందీ): సాయాజీ షిండే, మనోజ్‌ జోషి నటించిన క్రైమ్‌ డ్రామా ఇది. పుష్పేంద్ర సింగ్‌ దర్శకత్వం వహించారు.
  • వాయిస్‌ ఆఫ్‌ సత్యనాథన్‌ (మలయాళం): దిలీప్‌, జగపతిబాబు, జూడ్ ఆంథోనీ జోసెఫ్ కీలక పాత్రల్లో నటించిన ఈ కామెడీ థ్రిల్లర్‌ను రఫీ తెరకెక్కించారు.
  • వాలట్టి (మలయాళం): రోషన్‌ మాథ్యూ, రవీనా రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వాలట్టి’. శునకం నేపథ్యంలో సాగే ఈ కామెడీ, రొమాంటిక్‌ డ్రామాను దేవన్‌ జయకుమార్‌ రూపొందించారు.

20-07-2023

  • చావర్‌ (మలయాళం): అర్జున్‌ అశోకన్‌, కుంచకో బోబన్ నటించిన ఈ చిత్రానికి జాయ్‌ మాథ్యూ దర్శకత్వం వహించారు.

21-07-2023

  • స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌: సంజయ్‌ రావ్‌ హీరోగా ఎ.ఆర్‌.శ్రీధర్‌ తెరకెక్కించిన చిత్రమిది. ప్రణవి మానుకొండ కథానాయిక. స్లమ్‌ ఏరియాలో ఉండే ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే కథ ఇది.
  • అన్నపూర్ణ స్టూడియో: చైతన్య రావ్‌, లావణ్య జంటగా నటించిన ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
  • హత్య (తమిళం - తెలుగు): ‘డాక్టర్‌ సలీమ్‌’, ‘బిచ్చగాడు’, ‘బిచ్చగాడు 2’ వంటి విభిన్నమైన చిత్రాలతో.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ హీరో విజయ్‌ ఆంటోని. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఆయన నటించిన ‘హత్య’ సినిమాకి బాలాజీ కుమార్‌ దర్శకత్వం వహించారు.

28-07-2023

  • బ్రో: అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు యంగ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన సినిమా ఇది. సముద్రఖని దర్శకుడు.
  • రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ: బాలీవుడ్‌ నటులు రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించారు.

    గమనిక: ఇప్పటివరకూ ఆయా చిత్ర బృందాలు వెల్లడించిన తేదీలివి.. పరిస్థితులకు అనుగుణంగా స్వల్ప మార్పులు చోటు చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని