Kamal Haasan: అలా అనుకుని ఉంటే ఎప్పుడో రిటైరయ్యేవాణ్ని: కమల్
కమల్ హాసన్ పుట్టిన రోజు నేడు. 1954 నవంబరు 7న జన్మించిన కమల్ సినీ ప్రయాణం ఎలా సాగిందంటే..?
ఇంటర్నెట్ డెస్క్: ‘నటనంటే ఆయనే.. ఆయనే నటుడంటే’ అని కొన్ని కోట్లమంది ప్రేక్షకులతో అనిపించుకున్న నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). ‘హే రామ్’ సినిమాతో కట్టిపడేసిన దర్శకుడు కమల్ హాసన్. ‘మత్తుగ.. మత్తుగ.. కొత్త బీటును కొట్టండ్రా’ అని ఉర్రూతలూగించిన గాయకుడు కమల్ హాసన్.. ఇలా ఒకటా రెండా కమల్ హాసన్‌లోని కోణాలెన్నో. ఆయన చేసిన ప్రయోగాలు ఇంకెన్నో. పదో తరగతి కూడా చదవని ఈ వ్యక్తి ప్రపంచమంతా గుర్తించే స్థాయికి ఎదిగారు. అలాంటి ‘లోకనాయకుడి’ ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది? నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెలుసుకుందాం.. (Happy Birthday Kamal Haasan)
మరో నటి స్థానంలో..
కమల్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు? అనే వివరాలు తెలుసుకునే ముందు ఆయన నట ప్రయాణాన్ని చూద్దాం. మూడేన్నరేళ్ల వయసులో కమల్ ఓ పార్టీకి వెళ్లారు. అదే వేడుకలో ఉన్న ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏవీఎం చెట్టియార్ దృష్టి కమల్‌పై పడింది. ‘ఈ బాలుడు ఎవరో చాలా బాగున్నాడు’ అనుకుంటూ వివరాలు తెలుసుకుని, తాను నిర్మించిన ‘కలాతూర్ కన్నమ్మ’ (తమిళం) అనే చిత్రంలో కమల్‌కు అవకాశం ఇచ్చారు. అలా చిన్నప్పుడే ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు నిల్చొన్నారు కమల్. ఆయన పోషించిన పాత్రను డైసీ ఇరానీ (ప్రముఖ నటి.. బాల నటిగానూ విశేష గుర్తింపు పొందారు) నటించాల్సింది. కానీ, కమల్‌కు ఫిదా అయినా చెట్టియార్ ఆయన్నే ఎంపిక చేసుకున్నారు. ఆ పాత్రలో నటించినందుకు కమల్ అందుకున్న పారితోషికం రూ. 2 వేలు. ఆ రోజుల్లో అంతటి రెమ్యునరేషన్ అంటే చాలా గొప్ప. ‘మూడున్నరేళ్ల వయసు అంటే మాట్లాడటమే కష్టం. కానీ, నేను ‘ఎంత ఇస్తారు? నటిస్తున్నందుకు’ అని అడిగా అంటూ ఓ ఇంటర్వ్యూలో కమల్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
తొలి ప్రయత్నంలోనే జాతీయ అవార్డు
‘కలాతూర్ కన్నమ్మ’లోని సెల్వం అనే పాత్రతో ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న కమల్ వరుస సినిమాలతో బిజీగా గడిపేవారు. అయినా పెద్దయ్యాక నటనవైపు వెళ్లాలని ఆయన అనుకోలేదు. క్లాసికల్ డ్యాన్స్, సంగీతంలో శిక్షణ తీసుకున్న కమల్ డ్యాన్స్ అసిస్టెంట్‌గా మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఓ టెక్నిషియన్‌గా ఆయన పనిచేసిన తొలి చిత్రం ‘శ్రీమంతుడు’ (అక్కినేని నాగేశ్వరరావు హీరో). కమల్‌లోని నటుడిని చెట్టియార్ గుర్తిస్తే రచయితను కమల్ స్నేహితుడు ఆర్. సి. సత్యన్ గుర్తించారు. స్నేహితుడి ప్రోత్సాహంతో కమల్‌కు స్క్రీన్‌ప్లే రాయడంపై ఆసక్తి పెరిగింది. అటు కొరియోగ్రఫీ, ఇటు రైటింగ్ స్కిల్ ఉండటంతో ఆయన ఆ దారుల్లోనే నడవాలనుకున్నారు. మధ్యలో అసిస్టెంట్ డైరెక్టర్ కావాలనుకున్నప్పుడు.. కమల్‌ను ఓ ఆడిషన్ ఆహ్వానించింది. అది ప్రముఖ దర్శకుడు కె. బాల చందర్ తీయబోతున్న సినిమా అని లొకేషన్‌కు వెళ్లాక కమల్‌కు అర్థమైంది. కమల్‌ను ఫొటో ఇవ్వమని అక్కడున్న వారు అడగ్గా ‘నేను యాక్టింగ్ చేయటానికి రాలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం లేదా?’ అని ప్రశ్నించారట. ‘సినిమా స్టూడియోలకు ఆటోలో వెళ్లాలనుందా, కారులో తిరగాలనుందా? నువ్వు ఎంత గొప్ప నటుడివి అవుతావో నాకు తెలుసు. డైరెక్షన్ ఎప్పుడైనా చేయొచ్చు. ముందు నటించు’ అని బాల చందర్.. కమల్‌ను యువనటుడిగా పరిచయం చేశారు. ‘అరంగేట్రం’తో ప్రారంభమైన ఈ కాంబినేషన్లో 35కిపైగా చిత్రాలొచ్చాయి.
హెచ్చుతగ్గులు లేని నటుడు..
‘హెచ్చుతగ్గులు కనిపించకుండా నటిస్తున్నాడు’ అని ఎంతోమంది కమల్‌ను ప్రశంసించారు. ‘16 వయదినిలే’, ‘మరో చరిత్ర’ చిత్రాలు కమల్ కెరీర్‌ను మార్చాయి. ‘16 వయదినిలే’లో అంద విహీనుడిగా, ‘అపూర్వ సహోదరర్గల్’లో మరగుజ్జుగా, ‘గుణ’లో అమాయకుడిగా, ‘ఆకలిరాజ్యం’లో నిరుద్యోగిగా.. ఇలా కమల్ చేసిన సాహసాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ‘నేను తెలుగులో నేరుగా కొన్ని సినిమాలే చేశా. కానీ, అవి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఓరకంగా చెప్పాలంటే నా తమిళ సినిమాలకంటే ఇవే రికార్డు సాధించాయి’ అని కమల్ చెప్పటం ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యారో తెలియజేస్తుంది. ‘భారతీయుడు’, ‘నాయకుడు’ వంటి పవర్ఫుల్ కథలతో మెప్పించిన కమల్ ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’ వంటి క్లాసిక్ చిత్రాలతోనూ తనదైన ముద్ర వేశారు. కమల్‌కు సినిమా అంటే ఎంత పిచ్చో, దాని కోసం ఎంతగా కష్టపడతారో.. ‘దశావతారం’ చూస్తే అర్థమవుతుంది. ‘విశ్వరూపం 2’ తర్వాత కొంత విరామం తీసుకున్న కమల్ ఈ ఏడాది వచ్చిన ‘విక్రమ్’ సినిమాతో మరోసారి తన సత్తా చాటారు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ‘విక్రమ్’ సిరీస్‌తో పాటు, మణిరత్నం దర్శకత్వంలోనూ కమల్ నటించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చేఏడాది ఈ కమల్-మణి కలిసి పనిచేయనున్నారు.
ఆ కల నెరవేరింది..
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలి, ఫ్రెంచ్, ఆంగ్లం తదితర భాషలను అనర్గళంగా మాట్లాడ గలిగే కమల్ దర్శకుడవ్వాలనే తన కలను 1997లో నెరవేర్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చాచీ 420’. అది ఈయన హీరోగా నటించిన ‘అవ్వై షన్ముగి’ (తమిళం) సినిమాకి రీమేక్. ‘హేరామ్’, ‘విరుమాండి’, ‘విశ్వరూపం’ తదితర చిత్రాలు కమల్ దర్శకత్వ ప్రతిభకు ప్రతీకలు. నిర్మాత, గాయకుడు, వ్యాఖ్యాతగానూ కమల్ తన హవా కొనసాగించారు. వాటికే పరిమితంకాకుండా కెమెరా, సౌండింగ్, గ్రాఫిక్స్.. ఇలా ప్రతి విభాగంలోనూ పుంజుకున్న సాంకేతికతపైనా ఆయనకు పట్టుంది. స్వతహాగా హేతువాది అయిన కమల్ ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీని నెలకొల్పిన సంగతి తెలిసిందే.
అందరూ లాయర్లే..
230కిపైగా చిత్రాల్లో నటించిన కమల్‌ది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం అని అనుకుంటే పొరపాటే. తన తండ్రి సహా బంధువుల్లో 12 మంది లాయర్లు. కమల్ 8వ తరగతిలోనే చదువుకు స్వస్తి పలికారు. కమల్ ఏం చేయాలనుకున్నా దానికి తన తండ్రి పార్థసారథి శ్రీనివాసన్ ఎప్పుడూ అడ్డుచెప్పేవారు కాదు. 1954 నవంబరు 7న తమిళనాడులోని పరమకుడి అనే గ్రామంలో జన్మించిన కమల్‌కు చారు హాసన్ (నటుడు, దర్శకుడు), చంద్రహాసన్ (నటుడు, నిర్మాత) సోదరులు. కమల్ కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌లు కథానాయికలుగా రాణిస్తున్నారు.
కమల్ అంతరంగం ఇదీ..
పద్మశ్రీ, పద్మ భూషణ్ కమల్ హాసన్.. ‘‘ప్రతి మనిషిలో ఓ హీరో, ఓ విలన్ ఉంటారు. ఏం జరిగినా విలన్‌ను బయటకు తీసుకురాకుండా చేయటమే అసలైన జీవితం. ఇతిహాసాల్లోనూ మంచీ చెడూ ఉన్నాయి. అది చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. ఇన్నేళ్ల నా ప్రయాణంలో ‘చేసింది చాలు.. ఇకపై సినిమాలు ఆపేద్దాం’ అని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను నటనను ప్రొఫెషన్‌గా భావించలేదు. అలా అనుకుని ఉంటే ఎప్పుడో రిటైర్ అయ్యేవాణ్ని. యాక్టింగ్ నా ప్యాషన్. అందుకే ఇంకా కొనసాగుతున్నా. నేను పనిని ప్రేమిస్తా. హాలీడే ట్రిప్‌లా ఎంజాయ్ చేస్తా. కొంతమంది విహార యాత్రకు వెళ్లిన సమయంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కొండలు ఎక్కుతారు.. స్విమ్మింగ్ చేస్తారు. అదే తమ పని విషయానికొస్తే బద్ధకంగా ఉంటారు. లోపం ఎక్కడుందో గ్రహించుకోవాలి. పనిని ప్రేమిస్తే విజయం తప్పక వరిస్తుంది’’ అని చెబుతుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది?
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్