Krithi Shetty: స్టార్‌హీరో కుమారుడి వేధింపులు.. కృతిశెట్టి ఏమన్నారంటే

ఓ స్టార్‌ హీరో తనయుడు తనని వేధించాడంటూ కృతిశెట్టి (Kriti Shetty) చెప్పినట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. ఆయా కథనాలపై తాజాగా ఆమె స్పందించారు.  

Published : 07 Jul 2023 01:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిన్న వయసులోనే సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న ముద్దుగుమ్మల్లో నటి కృతిశెట్టి (Krithi Shetty) ఒకరు. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ భామ.. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌, కోలీవుడ్‌లో బిజీ అయ్యారు. కాగా, తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఓ స్టార్‌ హీరో తనయుడు తనను వేధించాడని, స్నేహం చేయమంటూ ఫోన్‌ చేసి విసిగించాడని, ఎక్కడికి వెళ్లినా తోడు రమ్మనేవాడని.. కృతి ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు పలు వెబ్‌సైట్స్‌లో కథనాలు వెలువడ్డాయి. గత కొన్నిరోజులుగా వస్తోన్న ఈ వార్తలపై ఆమె అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కథనాలను ఉద్దేశిస్తూ తాజాగా కృతిశెట్టి ట్వీట్‌ పెట్టారు.

‘‘దయచేసి ఇలాంటి కథనాలు సృష్టించి.. అసత్య ప్రచారాలు చేయడం మానండి. ఈ నిరాధారమైన వార్తలను పెద్దగా పట్టించుకోకూడదని మొదట అనుకున్నాను. అంతకంతకు ఈ ప్రచారం మరింత విస్తృతంగా మారుతోన్న తరుణంలో స్పందించక తప్పడం లేదు’’ అని ఆమె తెలిపారు. కృతిశెట్టి ట్వీట్‌తో ఆ కథనాలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయ్యింది.

సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘కస్టడీ’తో అలరించిన ఈ భామ.. కెరీర్‌లో సూపర్‌ హిట్‌ కోసం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈమె ‘అజాయంతే రందం మోషణం’ (Ajayante Randam Moshanam) అనే మలయాళం సినిమాలో నటిస్తున్నారు. దీనితోపాటు జయంరవి ‘జీని’లోనూ ఛాన్స్‌ కొట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని