‘లాల్‌ సలామ్‌’ బిగ్గరగా నవ్విస్తుందా..?

ఈ మధ్య వెబ్‌ సిరీస్‌లపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే కొత్తకొత్త కథలతో వెబ్‌సిరీస్‌లు విడుదలవుతున్నాయి. విభిన్నమైన కథాశంతో తెరకెక్కిన ‘లోల్‌ సలామ్‌’ వెబ్‌ సిరీస్‌ కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆరు ఎపిసోడ్లతో కూడిన ఈ సిరీస్‌ ఓటీటీ వేదిక ‘జీ5’లో జూన్‌ 25 నుంచి అందుబాటులోకి రాబోతోంది.

Updated : 13 Jun 2021 14:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్య వెబ్‌ సిరీస్‌లపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే కొత్త దర్శకులు వాటితోనే ముందుకొస్తున్నారు. అలా విభిన్నమైన కథాంశంతో నాని బండిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘లాల్‌ సలామ్‌’. ఆరు ఎపిసోడ్లతో కూడిన ఈ సిరీస్‌ ఓటీటీ వేదిక ‘జీ5’లో జూన్‌ 25 నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ను ప్రముఖ కథానాయకుడు నాని విడుదల చేశారు. ‘మనం ఒక ప్లాన్‌ వేస్తే.. దేవుడు ఇంకో ప్లాన్‌ వేస్తాడు’, ‘మనం ఆపాల్సింది మందిని కాదు.. మంటను’ అంటూ సాగే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఒత్తిడి తట్టుకోలేక విహారయాత్రకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఓ కుర్రాడు అనుకోకుండా ఓ ల్యాండ్‌మైన్‌ మీద కాలు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది..? వాళ్లు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే పూర్తికథ. ఈ వెబ్‌సీరిస్‌కు అజయ్‌ అరసాడ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: రాకేశ్‌ ఎస్‌.నారాయణ; ఎడిటర్‌: వెంకటకృష్ణ చిక్కాల; కథ-మాటలు: అర్జున్‌-కార్తీక్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు