Gautam: ‘ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమైనది’.. గౌతమ్‌కు విషెస్‌ చెప్పిన మహేశ్‌, నమ్రత

నేడు మహేశ్ (Mahesh Babu) కుమారుడు గౌతమ్‌  పుట్టినరోజు సందర్భంగా అతడికి కుటుంబసభ్యులు శుభాకాంక్షలు చెప్పారు.

Updated : 31 Aug 2023 12:32 IST

హైదరాబాద్‌: నేడు మహేశ్‌ బాబు కుమారుడు గౌతమ్‌ (Gautam Ghattamaneni) పుట్టినరోజు సందర్భంగా అతడికి నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మహేశ్‌ దంపతులు వీలున్నప్పుడల్లా వాళ్ల పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. నేడు గౌతమ్‌ పుట్టినరోజు కావడంతో కుటుంబసభ్యులు అతడిని విష్‌ చేశారు. అలాగే అభిమానులు కూడా గౌతమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొన్ని నిర్మాణసంస్థలు ప్రత్యేకమైన ఫొటోలతో అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఇక గౌతమ్‌ పుట్టిన దగ్గరి నుంచే తాను చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడం మొదలు పెట్టానని మహేశ్‌ ఇప్పటికి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ మాటలు మరోసారి ట్విటర్‌లో షేర్‌ అవుతున్నాయి.

  • ‘నువ్వు నా ఛాంపియన్‌వి. నువ్వు వేసే ప్రతి అడుగు నీ లక్ష్యాన్ని దగ్గర చేయాలి. ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు గౌతమ్‌. లవ్యూ’ - మహేశ్‌ బాబు (Mahesh Babu)
  • ‘హ్యాపీ బర్త్‌డే గౌతమ్‌, ప్రతి సంవత్సరం నువ్వు మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నావు. నీ కలలన్నీ నెరవేరాలి. వచ్చే ఏడాది నువ్వు విదేశాలకు వెళ్తావు. కాబట్టి ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమైనది. దీన్ని స్పెషల్‌గా సెలబ్రేట్‌ చేస్తా’ -  నమ్రత శిరోద్కర్‌ (Namrata Shirodkar)
  • ‘ప్రపంచంలోనే ఉత్తమమైన అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ - సితార (sitara Ghattamaneni)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని