Malli pelli ott release date: ఓటీటీలో ‘మళ్ళీ పెళ్లి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Malli pelli ott release date: నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ జంటగా నటించిన ‘మళ్ళీ పెళ్లి’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Updated : 19 Jun 2023 20:44 IST

హైదరాబాద్‌: నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. సీనియ‌ర్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌.రాజు ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రచారంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్స్‌లోనూ సందడి చేసింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఆహా వేదికగా జూన్‌ 23న ‘మళ్ళీ పెళ్లి’(Malli pelli ott release date) స్ట్రీమింగ్‌ కానుంది.

క‌థేమిటంటే: ప్ర‌ముఖ న‌టుడైన న‌రేంద‌ర్ (న‌రేశ్‌), సౌమ్య సేతుప‌తి (వనిత విజ‌య్‌కుమార్‌) వివాహ బంధంతో ఒక్క‌టై ఓ బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చాక‌... కాపురంలో కొన్ని క‌ల‌హాలు మొద‌ల‌వుతాయి. ప్ర‌శాంత‌త కావాల‌నుకున్న న‌రేంద‌ర్ జీవితంలోకి మ‌రో ప్ర‌ముఖ న‌టి అయిన పార్వ‌తి (ప‌విత్ర లోకేశ్‌) ఎలా వ‌చ్చింది? (Malli pelli) ఆమె జీవితం వెన‌క సంఘ‌ర్ష‌ణ ఎలాంటిది? ఆమె కోసం న‌రేంద‌ర్ ఏం చేశాడనేది తెర‌పైనే చూడాలి.

‘మళ్ళీ పెళ్లి’ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని