Naga Chaitanya: నాగచైతన్యతో ‘కార్తికేయ’ దర్శకుడి మీటింగ్‌.. త్వరలోనే సినిమా ప్రకటన?

హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి వైజాగ్‌లో చర్చలు సాగిస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో సినిమాపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది.

Published : 02 Aug 2023 23:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కార్తికేయ 2’ (Karthikeya 2)తో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti). ఆయన తదుపరి చిత్రాన్ని హీరో నాగచైతన్య (Naga Chaitanya)తో తెరకెక్కించే అవకాశాలున్నాయంటూ ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఆ సినిమా రూపొందనుందనే టాక్‌ వినిపించింది. తాజాగా నెట్టింట దర్శనమిచ్చిన ఓ ఫొటో ఆ ఊహాగానాలు నిజమనిపించేలా చేస్తోంది. ఈ హీరో, దర్శకుడు కనిపించడమే అందుకు కారణం. ఫొటోలో.. చందూ మొండేటి ఏదో చెబుతుంటే నాగచైతన్య శ్రద్ధగా వింటున్నట్టు కనిపించారు. పక్కనే నిర్మాత బన్నీవాసు కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ చిత్రాలొచ్చిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే ‘కార్తికేయ’తో హిట్‌ కొట్టిన చందూ దానికి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ను తీశారు.

ఆమె బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్‌.. ఎప్పటికీ అభిమానిస్తా: ప్రభాస్‌

‘కస్టడీ’తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగచైతన్యకు అనుకున్నంత స్థాయిలో విజయం దక్కలేదు. ఆయన ఇటీవల.. పుదుచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్‌ను సందర్శించారు. అక్కడి ఆర్టిస్ట్‌లు, డైరెక్టర్లలతో దిగిన ఫొటోలు, ప్రకృతి అందాలను క్యాప్చర్‌ చేసి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అక్కడ చేసిన ప్రయాణం ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. డైరెక్టర్‌ వినయ్‌ కుమార్‌ తదితరులను ట్యాగ్‌ చేస్తూ మంచి వ్యక్తులు, ఎంతో అందమైన ప్రదేశమిదని పేర్కొన్నారు. యాక్టింగ్‌ పరంగా మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు నాగచైతన్య అక్కడకు వెళ్లారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని