Naga Chaitanya: జిమ్‌లో కష్టపడుతోన్న నాగచైతన్య.. ఆ సినిమా కోసమేనా..!

తాజాగా నాగచైతన్య (Naga Chaitanya) ఓ వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Published : 05 Nov 2023 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆయన సినిమా అప్‌డేట్‌లతో పాటు వ్యాయామం వీడియోలను, వెకేషన్‌ ఫొటోలను కూడా పంచుకుంటారు. తాజాగా ఆయన జిమ్‌లో వర్క్‌వుట్‌ చేస్తోన్న వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. అందులో నాగచైతన్య లాంగ్ హెయిర్‌తో కొత్త లుక్‌లో కనిపించారు. చందూ మొండేటి సినిమా కోసమే ఈ హీరో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ జిమ్ వీడియో చూసి ఆయన ఫ్యాన్స్‌ ఖుష్ అవుతున్నారు. ఇక చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య 23వ సినిమాగా #NC23అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది ప్రచారంలో ఉంది. బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో తన పాత్ర కోసం నాగచైతన్య ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని కొంతమంది మత్స్యకారులను కలిసి వారి జీవన విధానాన్ని తెలుసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని