Naveen Polishetty: ఆ తప్పు జరిగినందుకు మన్నించండి: నవీన్‌ పొలిశెట్టి

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో నవీన్‌ పాల్గొని సందడి చేశారు.

Published : 04 Sep 2023 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను నటించిన కొత్త చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చిత్రీకరణకు అధిక సమయం పట్టిందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల వల్ల విడుదల ఆలస్యం అయిందని, ఆ తప్పు జరిగినందుకు తమను మన్నించాలని నటుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) ప్రేక్షకులను కోరారు. ఎప్పుడో విడుదలకావాల్సిన సినిమా ఆలస్యమై వారిని నిరాశకు గురిచేసిందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. నవీన్‌ హీరోగా దర్శకుడు పి. మహేశ్‌ తెరకెక్కించిన చిత్రమిది. అనుష్క శెట్టి (Anushka Shetty) కథానాయిక. ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే పలు నగరాలు సందర్శించి అక్కడి అభిమానుల్ని కలిసిన నవీన్‌.. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనదైన శైలి కామెడీతో అభిమానుల్ని అలరించారు. వారితో కలిసి సెల్ఫీలు దిగారు.

సమంతను స్ఫూర్తిగా తీసుకోండి: చిన్మయి పోస్ట్‌

అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘మీరు మాపై చూపించే ప్రేమకు మంచి సినిమాను తప్ప మేం ఇంకేమీ ఇవ్వలేం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఇది. కుటుంబ ప్రేక్షకులూ చూడదగ్గ చిత్రమిది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ సోమవారం ఉదయం నుంచి ప్రారంభవుతాయి’’ అని తెలిపారు. ఈ సినిమాలో స్టాండప్‌ కమెడియన్‌గా నవీన్‌, చెఫ్‌గా అనుష్క సందడి చేయనున్నారు. ‘జాతిరత్నాలు’ (2021) తర్వాత నవీన్‌, ‘నిశ్శబ్దం’ (2020) తర్వాత అనుష్క నటించిన చిత్రం ఇదేకావడంతో ఇరువురి అభిమానులు ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని