OMG 2: 27 మార్పులతో ‘ఓ మైగాడ్‌’.. అందుకేనా ఆ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌..!

అక్షయ్ కుమార్ (Akshay Kumar) కీలక పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్2’ చిత్రానికి సెన్సార్‌బోర్డు 27 మార్పులు చెప్పింది.

Updated : 01 Aug 2023 19:56 IST

హైదరాబాద్‌: అక్షయ్ కుమార్ (Akshay Kumar) కీలక పాత్రలో అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ మై గాడ్2’ (OMG 2 Movie). పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇవ్వడం గమనార్హం. అంతేకాదు 27 మార్పులను కూడా సూచించింది. ఈ సినిమా రన్‌టైమ్‌ 2గంటల 36 నిమిషాలు. జులై 31న ఈ సినిమా సెన్సార్‌కు వెళ్లగా, మొత్తం 27 మార్పులు సూచించింది. ముందు తీసిన సినిమా నుంచి సుమారు 13 నిమిషాల సన్నివేశాలను తొలగించారు. వాటి స్థానంలో కొత్తగా తీసిన 14 నిమిషాలు యాడ్ చేశారు.

పవన్‌ నన్ను కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారు: అంబటి రాంబాబు

ఇప్పటి వరకు విడుదలైన ‘ఓ మై గాడ్2’ ప్రచార చిత్రాలు చూస్తే... అక్షయ్ కుమార్ శివుని ఆహార్యంలో కనిపించారు. సినిమాలోనూ ఆయన శివుని పాత్ర పోషించారు. సెన్సార్ మార్పులు తర్వాత శివునిగా కాకుండా శివ భక్తుడిగా, దైవదూతగా మార్చినట్లు సమాచారం. ఇక ‘ఓ మై గాడ్ 2’ కథలో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రధాన అంశంగా చర్చించినట్లు టాక్‌. ఈ నేపథ్యంలో దిగంబరులుగా కనిపించే నాగ సాధువులు ఉన్న విజువల్స్‌, బిల్‌ బోర్డులో కనిపించే కండోమ్‌ పోస్టర్‌లు, కోర్టులను ఎగతాళి చేసే సంభాషణలు,  న్యాయమూర్తి కోర్టులో సెల్ఫీ తీసుకునే సీన్‌, ‘సత్యం శివమ్ సుందరం’ డైలాగ్‌ ఇలా మొత్తం 27 సన్నివేశాలకు సెన్సార్‌ బోర్డు మార్పులు చెప్పింది. ‘లింగ్‌’ అనే పదం వచ్చినప్పుడల్లా ‘శివలింగ్‌’, ‘శివ’ అని మాత్రమే సంబోధించాలని సెన్సార్‌ బోర్డు పేర్కొంది.

2012లో వచ్చిన ‘ఓ మైగాడ్‌’కు కొనసాగింపుగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఆ చిత్రంలో కనిపించిన విధంగానే పరేశ్‌ రావల్‌ ఇందులోనూ నటిస్తారని అనుకున్నారు. కానీ, ఆ స్థానంలో పంకజ్‌ త్రిపాఠి వచ్చి చేరారు. మరో టాక్‌ ఏంటంటే, ఈ సినిమా తెలుగులో వచ్చిన ‘మా వూళ్లో మహాశివుడు’ చిత్రానికి దగ్గరగా ఉంటుందని సమాచారం. అయితే, నేటి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా సన్నివేశాలను రాసుకున్నట్లు బాలీవుడ్‌ టాక్‌. అది నిజమో?కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని