Papam Pasivadu: క్రాంతి.. కన్‌ఫ్యూజన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌.. ‘పాపం పసివాడు’ టీజర్‌!

శ్రీరామ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పాపం పసివాడు’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

Published : 04 Sep 2023 19:00 IST

హైదరాబాద్‌: గాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశాడు శ్రీరామ చంద్ర (Sreerama Chandra). ఆయన కీలక పాత్రలో రూపొందిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘పాపం పసివాడు’ (Papam Pasivadu). లలిత్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాశీసింగ్‌, విద్య మహర్షి, గాయత్రి చాగంటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘ఆహా’ (Aha) ఓటీటీ వేదిక సెప్టెంబరు 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర టీజర్‌ను ‘ఆహా’ విడుదల చేసింది. ‘ఇతడి పేరు క్రాంతి. కన్‌ఫ్యూజన్‌ ఎక్కువ. క్లారిటీ అయితే చాలా తక్కువ’ అంటూ మొదలైన టీజర్‌ ఆద్యంతం అలరించేలా ఉంది. మరి క్రాంతి కన్‌ఫ్యూజన్‌కు కారణం ఏంటి? దాని వల్ల అతడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. జోస్‌ జిమ్మీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ది వీకెండ్‌ షో పతాకంపై అఖిలేష్‌ వర్థన్‌ నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని