నయనతారపై రాధారవి అనుచిత వ్యాఖ్యలు

అగ్రకథానాయిక నయనతార గురించి కోలీవుడ్‌ డబ్బింగ్‌ యూనియన్‌ ఆర్టిస్ట్‌ ప్రెసిడెంట్‌, భాజపా నాయకుడు రాధారవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో డీఎంకే పార్టీ కోసం పనిచేసిన రాధారవి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పార్టీ నుంచి బయటకు...

Published : 02 Apr 2021 01:32 IST

నటిపై రాధారవి తీవ్ర వ్యాఖ్యలు

చెన్నై: అగ్రకథానాయిక నయనతార గురించి కోలీవుడ్‌ డబ్బింగ్‌ యూనియన్‌ ఆర్టిస్ట్‌ ప్రెసిడెంట్‌, భాజపా నాయకుడు రాధారవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో డీఎంకే పార్టీ కోసం పనిచేసిన రాధారవి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన భాజపా-ఏఐఏడీఎంకే పొత్తు తరఫున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార వేదికపై మాట్లాడుతూ నయనతార గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘డీఎంకే పార్టీకి నయనతార ఏమవుతుంది? ఆమె ఏమైనా ఆ పార్టీకి పీఆర్‌వోనా(ప్రజా సంబంధాల అధికారి)? గతంలో ఓ సభలో ఆమె గురించి మాట్లాడినందుకు ఆ పార్టీ నుంచి నన్ను తొలగించాలని కొంతమంది పెద్దలు చూశారు. తొలగింపు ఆదేశాలు వాళ్లు నాకు పంపించేలోపే నేనే ఆ పార్టీకి శాశ్వతంగా రాజీనామా చేశా. ఒకవేళ ఆమె కనుక ఉదయనిధి స్టాలిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను?’’ అని రాధారవి వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, గతంలోనూ రాధారవి ఓ సినిమా వేడుకలో నయన్‌ గురించి అసభ్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన డీఎంకే పార్టీకి రాజీనామా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని