Rajamouli: ‘బాహుబలి-1’.. ఆ దృశ్యాలు ఎప్పటికీ మర్చిపోను: రాజమౌళి

‘బాహుబలి 1’ (Bahubali 1) ను ఉద్దేశిస్తూ రాజమౌళి (Rajamouli) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం అది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 

Published : 16 Aug 2023 18:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) - రానా (Rana) ప్రధాన పాత్రల్లో నటించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బాహుబలి’ (Bahubali). రాజమౌళి (Rajamouli) దర్శకుడు. 2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ను ఉద్దేశిస్తూ దర్శకధీరుడు రాజమౌళి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని ట్వీట్‌ చేశారు. మరో కొన్నిరోజుల్లో ఈ సినిమా మ్యూజికల్‌ కాన్సర్ట్‌ నార్వేలో జరగనున్నట్లు చెప్పారు.

‘‘లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో జరిగిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ అద్భుత ప్రదర్శనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ దృశ్యాలు ఇప్పటికీ నా కళ్లలో అలాగే నిలిచి ఉన్నాయి. ఇక, ఇప్పుడు ఆగస్టు 18న నార్వేలోని స్టావెంజర్‌ ఒపెరా హౌస్‌లో ‘బాహుబలి -1’ ప్రదర్శన జరగనున్నందుకు ఆనందంగా ఉంది. స్టావెంజర్ సింఫనీ ఆర్కెస్ట్రా సారథ్యంలో ఇది ప్రదర్శన జరగనుంది’’ అని ఆయన పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలు రాఘవేంద్రరావు, శోభూ యార్లగడ్డతో దిగిన ఓ ఫొటోని జక్కన్న అభిమానులతో పంచుకున్నారు. నార్వేలోని స్టావెంజర్‌ సిటీలో ఈ కాన్సర్ట్ హాల్‌ ఉంది. 2012లో దీనిని ప్రారంభించారు. 1500 మంది కూర్చొనే సామర్థ్యం కలిగిన ఈ హాల్‌లో ‘బాహుబలి-1’ ప్రదర్శన జరగడంపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటిపేరు పాడుచేస్తున్నా అని తిట్టారు: నవీన్‌ పొలిశెట్టి

‘బాహుబలి’ చిత్రాన్ని రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించారు. బాహుబలిగా ప్రభాస్‌.. భళ్లాలదేవుడిగా రానా.. దేవసేనగా అనుష్క నటించి మెప్పించారు. 2015లో విడుదలైన ‘బాహుబలి-1’, 2017లో వచ్చిన ‘బాహుబలి-2’ తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాయి. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సీక్వెల్‌గా ‘బాహుబలి 3’ తీసే ఆలోచన ఉందని, కాకపోతే అది ఇప్పుడే ఉండకపోవచ్చు అని గతంలో చిత్రబృందం వెల్లడించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఘన విజయం అందుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబు సినిమా పనుల్లో బిజీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని