Salman Khan: ఓ షోలో సిగరెట్‌తో సల్మాన్‌ఖాన్‌.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రోగ్రామ్‌లో ఆయన సిగరెట్‌తో కన్పించారు.

Updated : 09 Jul 2023 18:34 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman khan) మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ కార్యక్రమంలో ఆయన సిగరెట్‌తో కన్పించడం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. ఎదుటివారికి నీతులు చెప్పేముందు మనం మారాలనే విషయం సల్మాన్‌ తెలుసుకోవాలంటూ పలువురు సోషల్‌మీడియా యూజర్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ సెలబ్రిటీ రియాల్టీ షోకు సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఓటీటీ వేదికగా ప్రసారమయ్యే ఈ షో రెండో సీజన్‌ ఇటీవల ప్రారంభమైంది. కాగా, శనివారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో ఆయన పాల్గొని.. హౌస్‌లో ఉన్న సెలబ్రిటీల తప్పొప్పులపై విశ్లేషణ చేశారు. పలువురికి కౌంటర్లు కూడా వేశారు.

ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో సల్మాన్‌ సిగరెట్‌ చేతిలో పట్టుకుని కనిపించారు. దీనిని చూసిన నెటిజన్లు.. కంటెస్టెంట్స్‌తో మాట్లాడేటప్పుడు సల్మాన్‌ సిగరెట్‌ కాల్చాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కెమెరా ముందుకు వచ్చేముందు ఇలాంటివి చేయకూడదని మీకు తెలియదా?’, ‘మీరు ఎంతోమందికి స్ఫూర్తి. ఇలాంటి వాళ్లే ఇలా పబ్లిక్‌గా సిగరెట్‌ కాలిస్తే.. ఎదుటివారు ఏం నేర్చుకుంటారు?’, ‘పాపం ప్రోగ్రామ్‌ ఎడిటర్స్‌ సరిగ్గా చూసుకున్నట్లు లేరు’ అంటూ తీవ్రంగా దూషిస్తున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే సల్మాన్‌ నటించిన ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనలకు పరిమితమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని