samajavaragamana: ఓటీటీలోకి ‘సామజవరగమన’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

వినోదాత్మక చిత్రంగా అలరించిన ‘సామజవరగమన’ (samajavaragamana) ఓటీటీలోకి రానుంది. ఆహా వేదికగా ప్రేక్షకులకు నవ్వులు పంచనుంది.

Updated : 21 Jul 2023 17:24 IST

హైదరాబాద్‌: ఈ ఏడాది మంచి విజయం సొంతం చేసుకున్న చిత్రాల్లో  శ్రీవిష్ణు నటించిన ‘సామజవరగమన’ (samajavaragamana) ఒకటి. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. వినోదాత్మక చిత్రంగా అలరించిన ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జులై 28 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నరేష్, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల ఇందులో కీలకపాత్రలు పోషించారు.

వెబ్‌సిరీస్‌గా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ అన్‌రిపోర్టెడ్‌

క‌థేంటంటే: బాలు (శ్రీవిష్ణు) ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. సంపాదించే ప్ర‌తి రూపాయిని జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు పెట్టే స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి మ‌న‌స్త‌త్వం త‌న‌ది. తండ్రి ఉమా మహేశ్వ‌ర‌రావు (న‌రేష్‌)ను డిగ్రీ పాస్ చేయించేందుకు తిప్ప‌లు ప‌డుతుంటాడు. ఎందుకంటే ఆయ‌న డిగ్రీ పూర్తి చేస్తేనే త‌న తాత వీలునామా ప్ర‌కారం కోట్ల రూపాయ‌ల ఆస్తి చేతికొస్తుంది. ఆయ‌న డిగ్రీ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు రాసే క్ర‌మంలో స‌ర‌యు (రెబా మోనికా జాన్‌)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ త‌ర్వాత ఆమె పేయింగ్ గెస్ట్‌గా బాలు ఇంట్లోకి అడుగు పెడుతుంది. ‘ఐ ల‌వ్ యూ’ అంటూ చెప్పిన అమ్మాయిలతో బ‌ల‌వంతంగా రాఖీ క‌ట్టించుకునే బాలు.. స‌ర‌యుతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రూ పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవ‌డానికి ఓ ప్ర‌ణాళిక కూడా ర‌చిస్తారు. అయితే త‌న‌ బావ పెళ్లి బాలుకు ఓ విచిత్ర‌మైన స‌మ‌స్య తెచ్చిపెడుతుంది. మ‌రి ఆ స‌మ‌స్య ఏంటి? త‌న‌ బావ పెళ్లికి.. బాలు- స‌ర‌యు ప్రేమ‌క‌థ‌కు ఉన్న లింకేంటి? అస‌లు స‌ర‌యు కుటుంబ నేప‌థ్య‌మేంటి? వీళ్ల ప్రేమ క‌థ చివ‌ర‌కు ఏమైంది? బాలు తండ్రి డిగ్రీ పాసై త‌న ఆస్తి ద‌క్కించుకున్నాడా? లేదా? అన్న‌వి తెర‌పై చూసి తెలుసుకోవాలి (Samajavaramana on OTT).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని