Samantha: షూటింగ్‌లో గాయపడ్డ సమంత.. వైరలవుతోన్న ఫొటో

అగ్ర కథానాయిక సమంత (Samantha) ఓ షూటింగ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫొటోను ఆమె షేర్‌ చేసింది.

Updated : 28 Feb 2023 15:38 IST

హైదరాబాద్‌: స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)కు నటన అంటే ఎంతో అభిమానం. ఈ విషయాన్ని ఆమె ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించింది. సినిమాల్లో సన్నివేశం బాగా రావడం కోసం ఆమె ఎంత కష్టపడడానికైనా సిద్ధపడుతుందని పలువురు స్టార్‌ హీరోలు ఆమెపై ప్రశంసలు కురిపించిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా సమంత షేర్‌ చేసిన ఫొటో తన కష్టానికి నిదర్శనంగా నిలుస్తోంది. చేతులకు గాయాలైన ఫొటో పోస్ట్‌ చేసిన సామ్‌ షూటింగ్‌లో గాయపడ్డట్లు తెలిపింది. ఓ అభిమాని ఆ ఫొటోకు ‘ప్రపంచమంతా వాటిని గాయాలుగా భావిస్తారు..నటీనటులు మాత్రం వాటిని ఆభరణాలు అనుకుంటారని’ కామెంట్‌ పెట్టగా సమంత ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.

మయోసైటిస్‌ నుంచి కోలుకుంటున్న సమంత ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్‌ సిరీస్‌లతో తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె ‘సిటాడెల్‌’ (Citadel) వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ షూటింగ్‌లోనే సమంత గాయపడినట్లు తెలుస్తోంది. ఇందులో భారీ యాక్షన్‌ సన్నివేశాలున్నాయి. సామ్‌ ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఎంతో కష్టపడుతోంది. ఇటీవలే దీని కోసం 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేసింది. రాజ్‌- డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో వరుణ్‌ ధావన్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక వీటితోపాటు సమంత నటించిన  ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ సరసన ‘ఖుషి’ (Kushi)లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని