Siddharth: అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చా: సిద్ధార్థ్‌

‘చిన్నా’ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు నటుడు సిద్ధార్థ్‌ (Siddharth). తాజాగా ఆయన స్టార్‌ హీరో ఓ సినిమా గురించి మాట్లాడారు. హీరో లవ్‌ ఫెయిల్యూర్‌ సీన్‌ చూసి తాను భావోద్వేగానికి గురయ్యానన్నారు. 

Updated : 02 Oct 2023 20:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు సిద్ధార్థ్‌ (Siddharth) కీలక పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చిత్తా’ (Chithha). ఇదే చిత్రాన్ని ‘చిన్నా’ (Chinna) పేరుతో అక్టోబర్‌ 6న తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఓ స్టార్‌ హీరో సినిమా చూసి తాను వెక్కి వెక్కి ఏడ్చానని అన్నారు.

శ్రీదేవి మరణం.. డైట్‌ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది: బోనీ కపూర్‌

‘‘నేను కమల్‌ హాసన్‌ సర్‌కు వీరాభిమానిని. ఇటీవల ఆయన్ని కలిశా. ఎన్నో విషయాల గురించి మేము మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ‘విచిత్ర సోదరులు’ చిత్రీకరణ నాటి అనుభవాలను ఆయన నాతో పంచుకున్నారు. ఆయన మాటలు విని నేను భావోద్వేగానికి గురయ్యా. ‘సర్‌.. నాకెందుకో బాధగా ఉంది. మీరు మాట్లాడుతుంటే ఆ సినిమా చూసిన క్షణాలు నాకు గుర్తుకువస్తున్నాయి. తొమ్మిదేళ్ల వయసులో మా అమ్మతో కలిసి ఆ సినిమా చూశా. సినిమాలోని రిజిస్టర్‌ ఆఫీస్‌ సీన్‌ చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చా. ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ సీన్‌ గుర్తుకువచ్చింది’ అని చెప్పా’’ అని సిద్ధార్థ్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు