Sita Ramam: ‘సీతారామం’.. తొలగించిన సన్నివేశమూ అద్భుతం!

‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా ప్రేక్షకుల ముందుకొచ్చి, గెలిచిన చిత్రం ‘సీతారామం’.

Published : 24 Sep 2022 02:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా ప్రేక్షకుల ముందుకొచ్చి, గెలిచిన చిత్రం ‘సీతారామం’ (Sita Ramam). సినిమా విడుదలై 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా చిత్ర బృందం ‘డిలీటెడ్‌ సీన్‌’ను పంచుకుంది. నిడివి ఎక్కువైతే కొన్ని సన్నివేశాలను తొలగించక తప్పదు. ఆ కారణంతో కట్‌ చేసిన ఓ సన్నివేశాన్నే ‘సీతారామం’ టీమ్‌ శుక్రవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘సినిమాలో చూపించిన సన్నివేశాలే కాదు తొలగించిన సీనూ అద్భుతం’ అని అనిపించేలా ఉందా వీడియోలోని కంటెంట్‌. పాకిస్థాన్‌ ఆర్మీలో చేతుల్లో చిక్కుకున్న హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), కీలక పాత్రధారి సుమంత్‌ల మధ్య చిత్రీకరించిన సన్నివేశమది. ఫుట్‌బాల్‌ ఆట పూర్తయిన తర్వాత.. ‘విష్ణు సర్‌.. మళ్లీ మీరే గెలిచారు’ అని దుల్కర్‌ అనగానే సుమంత్‌ విరుచుకుపడతారు. ‘నేను నీలా అనాథనుకాను నా కోసం కుటుంబం ఎదురుచూస్తుంటుంది’ అని సుమంత్‌ దుల్కర్‌పై కోపాన్ని ప్రదర్శిస్తారు. దాంతో, దుల్కర్‌ భావోద్వేగానికి గురవుతారు. సినిమా చూడని వారికీ ఈ సీన్‌ కనెక్ట్‌ అయ్యేలా ఉంది.

ఈ చిత్రంలో బ్రిగేడర్‌ విష్ణుశర్మగా సుమంత్‌, లెఫ్టినెంట్‌ రామ్‌గా దుల్కర్‌ నటించారు. రామ్‌ ప్రేమించిన ‘సీత’ పాత్రలో మృణాల్‌ ఠాకూర్‌ అందరినీ కట్టిపడేశారు. రష్మిక, తరుణ్‌ భాస్కర్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించారు. ఈ సినిమా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని