ఆది, రాంప్రసాద్‌లకు అన్నపూర్ణమ్మ అదిరే పంచ్‌

ప్రతి ఆదివారం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు, సరికొత్త ప్రతిభ కలిగిన వ్యక్తులను పరిచయం చేస్తున్న ఎంటర్‌టైనింగ్‌ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.

Published : 23 Jun 2021 01:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి ఆదివారం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు, సరికొత్త ప్రతిభ కలిగిన వ్యక్తులను పరిచయం చేస్తున్న ఎంటర్‌టైనింగ్‌ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. వచ్చే ఆదివారం అలరించే స్కిట్‌లతో పాటు, బల్వీర్‌ ఆలపించిన ఫోక్‌లను కూడా ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అలనాటి నటి అన్నపూర్ణమ్మ వేసిన పంచ్‌లకు ఆది, రాంప్రసాద్‌లతో పాటు, లేడీ ఆర్టిస్ట్‌లకు కూడా దిమ్మ తిరిగిపోయింది. గతంలో, ఇప్పుడు చిన్నారులకు నీళ్లు ఎలా పోస్తున్నారనే దానిపై ఇమ్మాన్యుయేల్‌ స్కిట్‌ కితకితలు పెడుతోంది. ఇక ఈసారి 1980 థీమ్‌తో చేసిన స్కిట్‌లు నవ్వులు పూయిస్తున్నాయి. పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే జూన్‌ 27వ తేదీ వరకూ ఆగాల్సిందే. అప్పటివరకూ ఆద్యంతం నవ్వులు పంచుతున్న ఈ ప్రోమోను చూసేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని