Leo: విడుదలకు ముందు ‘లియో’కు షాకిచ్చిన తమిళనాడు ప్రభుత్వం..

విజయ్‌-లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో రూపొందిన ‘లియో’(Leo) అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది.

Published : 18 Oct 2023 17:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘లియో’ (Leo). మరికొన్ని గంటల్లో (అక్టోబర్‌ 19) థియేటర్లలో సందడి చేయనుంది. అయితే, విడుదలకు ముందు ఈ చిత్ర నిర్మాతలకు తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. దీంతో విజయ్‌ (Vijay) అభిమానులు నిరాశపడుతున్నారు.

‘లియో’ సినిమా తొలిరోజు తెల్లవారుజామున 4గంటల ఆటకు అనుమతించాలని చిత్రబృందం ప్రభుత్వాన్ని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అయితే, దాన్ని ప్రభుత్వం నిరాకరించింది. అలాగే ఉదయం 7గంటల షోను కూడా రద్దు చేసింది. అక్టోబర్‌ 19 ఉదయం 9నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ప్రదర్శించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా ఎవరైనా ఎర్లీ మార్నింగ్‌ ఈ సినిమాను ప్రదర్శిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక రిలీజ్‌రోజు థియేటర్ల బయట ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినట్లు కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే ‘లియో’ ఆడియో విడుదలను కూడా క్యాన్సిల్‌ చేసుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక విజయ్‌ సొంతగడ్డపై తన సినిమాకు ఇలాంటి అనుభవం ఎదురవ్వడంపై ఆయనతో పాటు ఆయన అభిమానులు కూడా నిరాశచెందుతున్నారు.

రూటు మార్చిన బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి.. ‘భగవంత్‌ కేసరి’ విశేషాలివీ

మరోవైపు ఈ చిత్ర దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) వరుస ఇంటర్వ్యూలతో సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంటూ అంచనాలను రెట్టింపు చేస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే వీళ్ల ఫస్ట్‌లుక్స్‌, పాటలు ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని