Bigg Boss Telugu 5: షణ్ముఖ్‌, సిరిలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెస్సీ

మరో వారం రోజుల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ పూర్తి కానున్న తరుణంలో ఫన్‌డేలో భాగంగా ఆదివారం నాగార్జున ఇంటిసభ్యులందరికీ ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. వీడియో రూపంలో ఇంటి నుంచి ఎలిమినెటై వెళ్లిపోయి...

Updated : 13 Dec 2021 17:41 IST

మీ ఇద్దరి మధ్య ఏముంది? ఎమోషనల్‌గా ఎందుకు కనెక్ట్‌ అవుతున్నావ్‌?

హైదరాబాద్‌: మరో వారం రోజుల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ పూర్తి కానున్న తరుణంలో ఫన్‌డేలో భాగంగా ఆదివారం నాగార్జున ఇంటిసభ్యులందరికీ ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. వీడియో రూపంలో ఇంటి నుంచి ఎలిమేనేట్‌ అయి వెళ్లిపోయిన ఓ ఐదుగురు కంటెస్టెంట్స్‌ని వాళ్ల ముందుకు తీసుకువచ్చారు. ఫైనల్‌ రేసులో ఉన్న ఈ ఆరుగురిపై తమకున్న సందేహాలను ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ ప్రశ్నల రూపంలో అడిగారు. దానికి ఫైనలిస్టులు సమాధానాలిచ్చారు. ఇందులో భాగంగా జెస్సీ.. తన స్నేహితులైన సిరి, షణ్ముఖ్‌లపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఎవరు ఎవర్ని ఏం ప్రశ్నలు వేశారు? ఫైనలిస్టులు ఎలాంటి సమాధానాలిచ్చారు? చూద్దాం..

జెస్సీ: షణ్ణు.. నీకూ సిరికి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో నాకు బాగా తెలుసు. కానీ బయటవాళ్లు మీ ఇద్దరి గురించి ఏమనుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించావా?

షణ్ముఖ్‌: జెస్సీ.. సిరికి నాకు మధ్య ఎలాంటి అనుబంధం ఉందనే విషయం నీకు బాగా తెలుసు. రవి ఎలిమినేషన్‌, ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత బయటప్రజలు మా రిలేషన్‌ గురించి ఏమనుకుంటున్నారో నాకర్థమైంది. అందరికీ చెబుతున్నాను.. సిరి నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌ మాత్రమే. తనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక స్నేహితుడిగా పక్కనే ఉంటాను.

అనీమాస్టర్‌: ఎలిమినేటై ఇంటికి వచ్చిన తర్వాత ‘బిగ్‌బాస్‌’ ఎపిసోడ్స్‌ చూశాను. ‘‘నేను యాక్ట్‌ చేస్తున్నాను’’ అని నువ్వు మానస్‌తో చాలాసార్లు అన్నావు. నిన్ను బెస్ట్‌ ఫ్రెండ్‌లా భావించాను. అలాంటిది నువ్వు నా వెనుక అలా ఎందుకు మాట్లాడావు?

సన్నీ: అనీమాస్టర్‌ నిజంగానే మంచి స్నేహితురాలు. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయాక నేనెంతో బాధపడ్డా. ఆమె ముందు ఒకలా.. వెనుక మరోలా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కొన్నిసార్లు ఆమె.. తాను ఇక్కడికి ఎవ్వరితోనూ రిలేషన్‌ పెట్టుకోవడానికి రాలేదని.. కేవలం గేమ్‌ ఆడటానికి మాత్రమే వచ్చానని అంటారు. కానీ, హౌస్‌లో ఉన్న ఓ వ్యక్తిని బ్రదర్‌ అంటూ ఎక్కువగా చూస్తుంటారు. అందువల్ల ఆమె కొన్ని టాస్క్‌ల్లో సరైన నిర్ణయం కూడా తీసుకోలేకపోయారు. దానివల్లే నేను ఆమెపై నా అభిప్రాయాన్ని బయటపెట్టాను. కానీ ఆమెను తక్కువ చేయాలని చూడలేదు. ఇప్పటికీ అనీ మాస్టర్‌ వెళ్లిపోయినందుకు నేనెంతో బాధపడుతున్నా. భవిష్యత్తులో ఆమె నాకు మంచి స్నేహితురాలు అవుతుందని భావిస్తున్నా.

నటరాజ్‌: ఐస్‌ టాస్క్‌ సమయంలో పింకీ చేసిన వైద్యం వల్ల నువ్వు చాలా ఇబ్బందులుపడ్డావు. దానివల్లే మానస్‌ నిన్ను కూర్చొపెట్టి మరీ టికెట్‌ టు ఫినాలే గేమ్‌ ఆడి.. నువ్వు గెలిచేలా చేశాడు. గేమ్‌ పరంగా పింకీ చేసిన వైద్యం నీకు మైనస్‌ అయ్యిందా? లేదా ప్లస్‌ అయ్యిందా?

శ్రీరామ్‌: ప్లస్‌ లేదా మైనస్‌ అనేది పక్కన పెడితే ప్రతి టాస్క్‌ని నేను 100 శాతం పూర్తి చేయడానికి కష్టపడ్డాను. పింకీ చేసిన వైద్యం తర్వాత టికెట్‌ టు ఫినాలేలో.. ‘‘నా ఆట నేను ఆడలేకపోయానే’’ అనే బాధ ఇప్పటికీ మనసులో ఉండిపోయింది. కాబట్టి పింకీ వైద్యం నాకు మైనస్‌ అయ్యిందనే అనుకుంటున్నా.

పింకీ: ఇన్ని రోజులూ నువ్వు నన్ను భరించావా? లేదా నాతో ఫ్రెండ్‌గా ఉన్నట్లు నటించావా?

మానస్‌: నేను భరించాను‌. నటించలేదు. తనపై నాకు ఎప్పుడు ఎలాంటి ఫీలింగ్‌ ఉంటే అది డైరెక్ట్‌గా చూపించేశాను. కొన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ తను అర్థం చేసుకోలేదు. పింకీకి స్ట్రయిట్‌గా చెబితే అర్థం కాదు. తను ఏం అర్థం చేసుకోవాలనుకుంటే అదే అర్థం చేసుకుంటుంది.

జెస్సీ: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి గేమ్‌ ఆడటానికి వెళ్లి.. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిపోతున్నా..అని అంటున్నావ్‌. అది అవసరమా నీకు?

సిరి: (జెస్సీ నువ్వు నాపై ఎప్పుడూ ఇంత కోపంగా లేవురా).. బిగ్‌బాస్‌కి గేమ్‌ ఆడటానికి వచ్చాను. ఆడుతున్నాను. ఒప్పుకుంటాను.. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవ్వాల్సిన అవసరం లేదు. 

ప్రియ: నువ్వు బయట కూడా ఇలాగే ఉంటావా? లేదా ఈ గేమ్‌ వరకే ఇలా ఉంటావా? అనేది తెలుసుకోవాలని ఉంది.?

కాజల్‌: బిగ్‌బాస్‌ హౌస్‌లో నేను నాలాగే ఉన్నాను. ఎప్పుడు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉంటున్నాను.

ఇలా ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ అడిగిన ప్రశ్నలకు ఇంటిసభ్యులు సమాధానమిచ్చిన అనంతరం జరిగిన ఎలిమినేషన్‌లో కాజల్‌ బయటకు వచ్చారు. దాంతో ప్రస్తుతం శ్రీరామ్‌, సన్నీ, మానస్‌, షణ్ముఖ్‌, సిరి.. టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

మరోవైపు చివరి వారం కావడంతో ఈ ఐదుగురు ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ మధురజ్ఞాపకాలను అందించేందుకు సిద్ధమయ్యారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో తమ జర్నీ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ ఈ ఐదుగురు ఎలా ఉన్నారు? ఏం చేశారు? అనేది తెలియజేసే విధంగా ఫొటోలతో హౌస్‌ని డెకరేట్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని