The Great Indian Suicide: చనిపోయిన వ్యక్తిని బతికించడానికి 8మంది ఆత్మహత్య!

హెబ్బాపటేల్‌ కీలక పాత్రలో విప్లవ్‌ కోనేటి దర్శకత్వంలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ ట్రైలర్‌ విడుదలైంది.

Updated : 03 Oct 2023 19:21 IST

హైదరాబాద్‌: ‘‘బళ్లారి నీలకంఠంగారు మా పెదనాన్న.. ఈ విధిని, డెస్టినీని మార్చలేమా అనుకుంటూ ఆయన చావుకు కారణం వెతుకుతుంటే, అనుకోకుండా వారిని బతికించుకునే దారి కనిపించింది. ఆయన కోసం ఆయన ప్రేమించే వాళ్లు, బలంగా కోరుకుని ప్రాణత్యాగం చేస్తే, మళ్లీ  తిరిగి వచ్చే అవకాశం ఉందట’ అంటోంది హెబ్బా పటేల్‌. ఆమె కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్’ (The Great Indian Suicide).  విప్లవ్‌ కోనేటి దర్శకుడు. న‌రేష్ వీకే, ప‌విత్రా లోకేష్‌, జయ ప్రకాశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని బతికించుకునేందుకు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఎంచుకున్న మార్గం ఏంటి? ఏ మూఢనమ్మకం వారిని ఆత్మహత్యకు పురిగొల్పింది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో అక్టోబరు 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మదనపల్లిలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని