Rashmika: లైవ్‌లో విజయ్‌ దేవరకొండకు ఫోన్‌ చేసిన రష్మిక..

ప్రముఖ ఎంటర్‌టైనింగ్‌ టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్‌బీకే’ (Unstoppable With NBK)తాజా ఎపిసోడ్‌లో ‘యానిమల్‌’ టీమ్ సందడి చేసింది. దీని ప్రోమో తాజాగా విడుదలైంది.

Published : 18 Nov 2023 12:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌షో ‘అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్‌బీకే’. లిమిటెడ్‌ ఎడిషన్‌ అంటూ అహా వేదికగా ప్రసారం అవుతోన్న ఈ షోలో తాజాగా ‘యానిమల్‌’ టీమ్ సందడి చేసింది.

బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, హీరోయిన్‌ రష్మికతో పాటు దర్శకుడు సందీప్‌వంగా కూడా హాజరయ్యారు. బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇందులో టాలీవుడ్‌ దర్శకుడు బోయపాటి శ్రీను గురించి సందీప్‌ వంగా మాట్లాడుతూ.. ఆయన ప్రతి యాక్షన్‌ ఎపిసోడ్‌ను గుడిలో ప్లాన్‌ చేస్తారన్నారు. అలాగే బాలకృష్ణ ఫేమస్‌ డైలాగు ‘ఫ్లూటు జింక ముందు ఊదు..’ను రణ్‌బీర్‌కపూర్‌ చెప్పి అలరించారు. అలాగే రష్మిక (Rashmika) లైవ్‌లో విజయ్‌ దేవరకొండకు ఫోన్‌ చేశారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్‌ నవంబర్ 24న ప్రసారం కానుంది.

రాజకీయ నేతగా మారిన నాని.. ఎన్నికల సీజన్‌ అంటూ పోస్ట్‌

ఇక ‘యానిమల్’ (Animal) విషయానికొస్తే డిసెంబర్‌ 1న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ఐదు భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని