ఉప్పెన.. కృతి ఇంత కష్టపడిందా!

ఈ ఏడాది టాలీవుడ్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ఒకటి ‘ఉప్పెన’. వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లతో సూపర్‌హిట్‌...

Published : 11 Apr 2021 14:11 IST

మేకింగ్‌ వీడియోలు షేర్‌ చేసిన దర్శకుడు

హైదరాబాద్‌: ఈ ఏడాది టాలీవుడ్‌లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ఒకటి ‘ఉప్పెన’. వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లతో సూపర్‌హిట్‌ అందుకుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం మైత్రిమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మితమైంది. కాగా, తాజాగా ‘ఉప్పెన’ మేకింగ్‌ వీడియోలను దర్శకుడు బుచ్చిబాబు అందరితో పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి, హావభావాలు పలికించడానికి కృతి ఎంతో కష్టపడిందో ఈ వీడియోల్లో చూడొచ్చు. అంతేకాకుండా ‘ఉప్పెన’లో యాక్షన్‌ సీక్వెన్స్, క్లాస్‌రూమ్‌ సన్నివేశాలను ఎలా చిత్రీకరించారో మీరూ ఓ సారి చూసేయండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని