siima awards 2023: ‘సైమా’లో ‘విక్రమ్’ హవా.. రెండు అవార్డులు అందుకున్న కమల్‌హాసన్
‘సైమా 2023’ (siima awards 2023) అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ వేడుకలో తాజాగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన వారికి అవార్డులు అందజేశారు.
ఇంటర్నెట్‌డెస్క్: దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘సైమా’ (siima awards 2023) అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరిగిన ఈ వేడుకల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమలకు చెందిన నటీనటులు సందడి చేశారు. శుక్రవారం తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు, సాంకేతిక బృందానికి అవార్డులు అందజేయగా.. శనివారం రాత్రి తమిళ, మలయాళం ఇండస్ట్రీ వారికి పురస్కారాలు అందించారు. తమిళంలో ‘విక్రమ్’, ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలు పోటా పోటీగా అవార్డులు అందుకున్నాయి. ఉత్తమ నటుడిగా కమల్‌హాసన్, ఉత్తమ నటిగా త్రిష అవార్డులు దక్కించుకొన్నారు.
‘సైమా’ 2023 అవార్డులు - కోలీవుడ్ విజేతలు వీళ్లే!
- ఉత్తమ నటుడు: కమల్‌హాసన్ (విక్రమ్)
- ఉత్తమ నటి: త్రిష (పొన్నియిన్ సెల్వన్ 1)
- ఉత్తమ దర్శకుడు: లోకేశ్ కనగరాజ్ (విక్రమ్)
- ఉత్తమ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ 1
- ఉత్తమ సహాయ నటుడు: కాళీ వెంకట్ (గార్గి)
- ఉత్తమ సహాయ నటి: వసంతి (విక్రమ్)
- ఉత్తమ విలన్: ఎస్.జె.సూర్య (డాన్)
- ఉత్తమ హాస్య నటుడు: యోగిబాబు (లవ్‌టుడే)
- ఉత్తమ పరిచయ నటుడు: ప్రదీప్ రంగనాథన్ (లవ్ టుడే)
- ఉత్తమ పరిచయ నటి: ఆదితి శంకర్ (విరుమన్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ (విక్రమ్)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ -1)
- ఉత్తమ గీత రచయిత: ఇళంగో కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్-1)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: కమల్‌హాసన్ (విక్రమ్)
- ఉత్తమ పరిచయ దర్శకుడు: ఆర్ మాధవన్ (రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆర్.మాధవన్ (రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): కీర్తి సురేశ్ (సాని కాయిదం)
- ఎక్స్‌ట్రార్డినరీ అచివ్‌మెంట్ అవార్డు: మణిరత్నం
- ఉత్తమ ప్రొడెక్షన్ డిజైనర్: తోట తరణి (పొన్నియిన్ సెల్వన్ -1)
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Nitin Gadkari : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ మాదే కానీ..: గడ్కరీ
-
BJP: తెలంగాణకు రెండో వారంలో అమిత్‌షా.. 6న నడ్డా
-
World Culture Festival: శాంతి, సామరస్య ప్రపంచం కోసం అందరం కలిసి కృషి చేయాలి!
-
Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్ బాబు విజ్ఞప్తి
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు