Vikram Veda: ‘విక్రమ్‌ వేద’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడు, ఎక్కడంటే?

హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్‌ వేద’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఏ ఓటీటీలో ఎప్పుడు విడుదల కానుందంటే?

Updated : 05 May 2023 22:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘విక్రమ్‌ వేద’ (Vikram Veda) ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం ‘జియో సినిమా’ (Jio Cinema)లో ఈ మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో సందడి చేసి, జయపజయాలతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు కొన్ని రోజుల్లోనే ఓటీటీల్లోకి వస్తుంటే గతేడాది సెప్టెంబరు 30న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ ప్లాట్‌ఫ్లామ్‌పైకి రాబోతోంది. హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

తమిళంలో విజయవంతమైన ‘విక్రమ్‌ వేద’కి రీమేక్‌గా పుష్కర్‌, గాయత్రి ద్వయమే ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా సైఫ్‌ అలీఖాన్‌, గ్యాంగ్‌స్టర్‌గా హృతిక్‌రోషన్‌ కనిపించి, ప్రేక్షకులను అలరించారు. వరుణ్‌ధావన్‌, కృతిసనన్‌ జంటగా నటించిన హిట్‌ చిత్రం ‘భేదియా’ (తోడేలు) ఇదే ఓటీటీలోకి త్వరలోనే విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రం కూడా గతేడాదిలోనే థియేటర్లలో సందడి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు