వాషింగ్టన్ డీసీలో కొడాలి నరేన్ ఆత్మీయుల కోలాహలం

ఇటీవల తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కొడాలి నరేన్‌కు ఆయన ఆత్మీయులు అభినందన సభ నిర్వహించారు.

Updated : 16 Jul 2023 23:05 IST

వాషింగ్టన్‌ డీసీ:  ఇటీవల తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కొడాలి నరేన్‌కు ఆయన ఆత్మీయులు అభినందన సభ నిర్వహించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో ఆయన ఇంటి వద్ద నిర్వహించిన ఈ సభ ఆత్మీయుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ.. విద్యావేత్త, సౌమ్యుడైన నరేన్ తన కార్యదక్షతతో తానా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్తారని ఆకాంక్షించారు.  రెండు దశాబ్దాల తమ స్నేహబంధాన్ని గుర్తు చేసుకొని తెలుగు వారికి ఇక ముందు సమష్టిగా అందరం చేయూతనందిస్తామని తెలిపారు. తానా ఉన్నంత వరకూ తెలుగుభాష అస్తిత్వం అమెరికాలో ఉంటుందని పాతూరి నాగభూషణం అన్నారు. రామ్ చౌదరి ఉప్పుటూరి, నరేన్‌ను అభినందించి తానా సేవా పరిధిని విస్తృతపరచాలని కోరారు.

ఆత్మీయ సోదరుల మధ్య బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ కొడాలి నరేన్ తన కృతజ్ఞతలు తెలిపారు. తానా తన జీవిత గమనంలో ఒక భాగమని, సంస్థ ఉన్నతికి తన శక్తికి మించి కృషిచేస్తానన్నారు. అందరినీ కలుపుకొంటూ ముందుకు సాగుతానన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక కార్యదర్శిగా ఎన్నికైన సత్య సూరపనేని, మన్నే సత్యనారాయణ, కృష్ణ లామ్, సుధీర్ కొమ్మి, భాను మాగులూరి, కార్తిక్ కోమటి, రవి అడుసుమిల్లి, సాయి బొల్లినేని, అనిల్ ఉప్పలపాటి, సతీష్ చింతా, యువ సిద్దార్థ్ బోయపాటి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని