ప్రవాస తెలుగు పురస్కారాలకు 12మంది ఎంపిక

ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల వికాసానికి పాటుపడుతున్న తెలుగువారిని గౌరవించాలనే ఉద్దేశంతో సౌత్‌ ఆఫ్రికన్‌ తెలుగు....

Updated : 25 Aug 2021 20:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల వికాసానికి పాటుపడుతున్న తెలుగువారిని గౌరవించాలనే ఉద్దేశంతో సౌత్‌ ఆఫ్రికన్‌ తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేశాయి.  తెలుగు భాషా దినోత్సవం రోజున కొందరికి ప్రవాస తెలుగు పురస్కారాల పేరిట అవార్డులు ప్రదానం చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు భాషా దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ పురస్కారాలకు నామినేషన్లు పంపేందుకు ఆగస్టు 10 ఆఖరు తేదీ కాగా.. పలు దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారు నానినేషన్లు పంపారన్నారు. తమకు అందిన నామినేషన్లను నిష్ణాతులైన జ్యూరీ పరిశీలించి 12 మందిని పురస్కారాలకు ఎన్నిక చేసిందని వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విక్రం పెట్లూరు, వెంకట్ తరిగోపుల, లక్ష్మణ్, తొట్టెంపూడి శ్రీ గణేష్ ఈ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. ఈ పురస్కారాలను ఆగస్టు 28, 29 తేదీల్లో జరగబోయే తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ప్రదానం చేస్తారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని