గంపగుత్తగా మార్చేయండి ఫొటోల సైజు

డిజిటల్‌ జీవితంలో ఫొటోల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వెబ్‌సైట్‌కైనా బ్లాగ్‌కైనా నిండుదనం ఇచ్చేవి ఫొటోలే. మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే ఇవి తగు సైజుల్లో ఉండటం చాలా అవసరం. మరి అన్ని ఫొటోలు ఒకే సైజులో ఉండవు కదా. ఒకట్రెండు అంటే ఏమో గానీ ఒకేసారి

Updated : 16 Jun 2021 06:12 IST

డిజిటల్‌ జీవితంలో ఫొటోల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వెబ్‌సైట్‌కైనా బ్లాగ్‌కైనా నిండుదనం ఇచ్చేవి ఫొటోలే. మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే ఇవి తగు సైజుల్లో ఉండటం చాలా అవసరం. మరి అన్ని ఫొటోలు ఒకే సైజులో ఉండవు కదా. ఒకట్రెండు అంటే ఏమో గానీ ఒకేసారి చాలా ఫొటోల సైజు మార్చుకోవాలంటే? కష్టమైన పనే. విండోస్‌ 10 వాడేవారు మాత్రం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మైక్రోసాఫ్ట్‌ ‘పవర్‌టాయ్స్‌’ టూల్‌తో దీన్ని తేలికగా పూర్తిచేయొచ్చు. ఇదో ఓపెన్‌ సోర్స్‌ ప్రోగ్రామ్‌. దీంతో విడివిడిగానే కాదు, ఒకేసారి పెద్దమొత్తంలోనూ ఫొటోల సైజు మార్చుకోవచ్చు.
ఎలాగంటే..?
* ముందుగా పవర్‌టాయ్స్‌ టూల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
* పవర్‌టాయ్స్‌ను ఓపెన్‌ చేసి, ఎడమ వైపున కనిపించే ‘ఇమేజ్‌ రీసైజర్‌’ ఆప్షన్‌ను నొక్కాలి. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి.
* ఇప్పుడు సైజు మార్చాలని అనుకుంటున్న ఫొటోలున్న ఫోల్డర్‌ను ఓపెన్‌ చేయాలి.
* రీసైజు చేయాలనుకుంటున్న ఫొటోలన్నింటినీ సెలెక్ట్‌ చేసుకొని, రైట్‌ క్లిక్‌ నొక్కాలి. మెనూలోంచి ‘రీసైజ్‌ పిక్చర్స్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.  
* రీసైజర్‌ విండోలోంచి డిఫాల్ట్‌గా ఉన్న సైజును గానీ కోరుకున్న సైజును గానీ ఎంచుకోవాలి.
* సైజు మారిన ఫొటోలు అదే ఫోల్డర్‌లో సేవ్‌ అవుతాయి.ఫొటోల సైజు, పేర్ల వంటి వాటిని సెటింగ్స్‌ ద్వారానూ ముందే నిర్ణయించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని