Dell Laptops: డెల్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్‌!

డెల్‌ కంపెనీ ఏలియన్‌ వేర్‌ x15 R2, ఏలియన్‌ వేర్‌ x17 R2 పేరుతో  గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లలో విడుదల చేసింది.

Updated : 11 May 2022 18:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ డెల్‌ కంపెనీ ఏలియన్‌వేర్‌ ఎక్స్‌ సిరీస్‌లో గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లలో విడుదల చేసింది.  ఏలియన్‌ వేర్‌ x15 R2, ఏలియన్‌ వేర్‌ x17 R2 పేరుతో వీటిని తీసుకొచ్చింది. ముందుగా మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌-2022లో ప్రకటించిన విధంగానే తాజాగా గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌ను భారత విపణిలో అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌ ప్రత్యేకతలేంటో? ధర, ఫీచర్ల వివరాలు చూసేద్దామా..


ఏలియన్‌ వేర్‌ x15 R2..

ఏలియన్‌ వేర్‌ x15 R2 సిరీస్ గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌ విండోస్‌ 11, విండోస్‌ 11 ప్రో వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో పనిచేస్తాయి. ఇందులో క్రియో-టెక్‌ కూలింగ్‌ టెక్నాలజీ అనే కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. 15.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920x1080 ఫిక్సల్‌ రిజల్యూషన్‌ కలిగి ఉంటుంది. 165 హెర్జ్‌, 360 హెర్జ్‌, 240 హెర్జ్‌ వంటి ప్యానెల్‌ల్లోనూ వీటిని పొందవచ్చు. వీటిలో 12వ జెనరేషన్‌ ఇంటెల్‌కోర్‌ ప్రాసెసర్‌ (i7-12700H, i9-12900H)ను ఇస్తున్నారు. ఇందులో 16 జీబీ ర్యామ్‌, 2టీబీ పీసీఐఈ స్టోరేజ్‌ సామర్థ్యం ఉంది. వైఫై 6, బ్లూటూత్ వీ 5.2, యూఎస్‌బీ టైప్ సీ పోర్టు, 3.2 యూనివర్సల్‌ ఆడియో జాక్‌ హెడ్ ఫోన్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌లో ఉన్నాయి. 

భారత్‌లో వీటి ప్రారంభ ధర రూ.2,49,900గా నిర్ణయించారు. డెల్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్స్‌, డెల్‌.కామ్‌ ఇతరత్రా అవుట్‌లేట్లలో ఈ గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌ విక్రయానికి అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.


ఏలియన్‌ వేర్‌ x17 R2..

ఏలియన్‌ వేర్‌ x17 R2 సిరీస్ గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌ x15 సిరీస్‌తో పోలిస్తే కొంచెం మందంగా ఉంటాయి. ఎన్విడియా జీ-సింక్‌ టెక్నాలజీతో 17.3 అంగుళాల పుల్‌ హెచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 12వ జెనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌ (i7-12700H, i9-12900H)ను ఇస్తున్నారు. వీటిలో 32 జీబీ ర్యామ్‌, 1టీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ సామర్థ్యం ఉంది. ఎన్విడియా జీఫోర్స్‌ ఆర్‌టీఎక్స్‌ 3060 గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటుంది.  ఇందులో థండర్‌బోల్ట్‌ 4 పవర్‌ డెలివరీ, యూనివర్సల్‌ ఆడియో జాక్‌, మిని డిస్‌ప్లే పోర్ట్, యూఎస్‌బీ 3.2 జెనరేషన్‌ 2 టైప్‌ సీ పోర్ట్స్, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ 5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

అంతేకాకుండా వీడియో చాట్స్ కోసం ప్రత్యేకంగా.. హెచ్‌డీ కెమేరా,  డూయల్‌ మైక్రోఫోన్స్‌, స్టీరీయో స్పీకర్స్‌, వూఫర్స్‌ కూడా ఉన్నాయి. భారత్‌లో వీటి ప్రారంభ ధర రూ.2,99,900గా నిర్ణయించారు. డెల్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్స్‌, డెల్‌.కామ్‌ ఇతరత్రా అవుట్‌లేట్లలో ఈ గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌ విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని