పాత ఫోన్ ప్రక్షాళన!
ఆండ్రాయిడ్ ఫోన్ పాతదై ఉండొచ్చు. దాన్ని అమ్మేసి కొత్తది కొనుక్కోవాలని అనిపించొచ్చు. లేదూ ఎవరికైనా ఫోన్‌ను ఇచ్చేస్తుండొచ్చు. ఇలాంటప్పుడు డేటాను పూర్తిగా తొలగించుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారేమో. ఫ్యాక్టరీ రీసెట్ చేసినా సమాచారం ఇతరుల చేతికి చిక్కే అవకాశం లేకపోలేదు. మరి ఫోన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయటమెలా?
ఆండ్రాయిడ్ ఫోన్ పాతదై ఉండొచ్చు. దాన్ని అమ్మేసి కొత్తది కొనుక్కోవాలని అనిపించొచ్చు. లేదూ ఎవరికైనా ఫోన్‌ను ఇచ్చేస్తుండొచ్చు. ఇలాంటప్పుడు డేటాను పూర్తిగా తొలగించుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారేమో. ఫ్యాక్టరీ రీసెట్ చేసినా సమాచారం ఇతరుల చేతికి చిక్కే అవకాశం లేకపోలేదు. మరి ఫోన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయటమెలా?
అప్పుడప్పుడు ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయటం మంచి పద్ధతే. దీంతో ఫోన్లోని చెత్త అంతా తొలగిపోతుంది. ఫోన్ ఖాళీ అయ్యి మరింత స్పేస్ అందుబాటులోకి వస్తుంది. ఫోన్ స్టోరేజీలో గానీ ఎస్డీ కార్డులో గానీ మాల్వేర్, బగ్స్, వైరస్‌లతో కూడిన హానికర ఫైళ్లు ఉన్నా తొలగిపోతాయి. ఆండ్రాయిడ్ ఫోన్‌ను అమ్మినప్పుడు కూడా చాలామంది చేసే పని ఇదే. ఫ్యాక్టరీ సెటింగ్స్‌ను రీసెట్ చేయటం వల్ల ఫోన్ తిరిగి సరికొత్తగా, ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చినప్పటి మాదిరిగానే తయారవుతుంది. ఫోన్ ఈమెయిళ్లు, టెక్స్ట్ సందేశాలు, ఫొటోలు, వీడియోలు అన్నీ కనుమరుగవుతాయి. కాకపోతే ఇక్కడ ఓ తిరకాసు ఉంది. తొలగించిన ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్లు, ఫొటోలు, సెల్ఫీల వంటి వాటిని మామూలు సాఫ్ట్‌వేర్‌తోనూ తిరిగి వెలికి తీసే అవకాశముంది. వీటిల్లో ఏదైనా వ్యక్తిగత, ముఖ్యమైన సమాచారం ఉన్నట్టయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అందువల్ల ఫ్యాక్టరీ రీసెట్ చేసినా కూడా ఫోన్లోని డేటా ఇతరుల చేతికి చిక్కకుండా, సంరక్షించుకోవటం రోజురోజుకీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. సాధారణంగా మనం పరికరంలోంచి ఏదైనా ఫైల్‌ను డిలీట్ చేసినప్పుడు అది ట్రాష్ లేదా బిన్‌లోకి చేరుతుంది. దీంతో అది పూర్తిగా డిలీట్ అయిపోయిందనే చాలామంది భావిస్తుంటారు. నిజానికి డిలీట్ అయినప్పటికీ దీని ప్రతిరూపం క్లౌడ్‌లో అలాగే ఉంటుంది. ముఖ్యంగా గూగుల్ ఫొటోస్ యాప్ డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలను 60 రోజుల వరకు స్టోర్ చేసి పెడుతుంది. ట్రాష్లోంచి వీటిని మనకు మనం తొలగించకపోతే తిరిగి వెలికి తీసే అవకాశముంది.
ఫోన్‌ను ఎన్క్రిప్షన్ చేసుకోవాలి
ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత కూడా సమాచారం వేరేవాళ్లకు చిక్కకుండా చూసుకోవటానికి ఇతరత్రా పద్ధతులూ ఉన్నాయి. ముందుగా ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవాలి. దీంతో డేటా అంతా ముక్కలు ముక్కలవుతుంది. లాక్ అవుతుంది. పాస్వర్డ్ లేకపోతే దీన్ని చదవటానికి కుదరదు. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మల్లోతో కూడిన పరికరాలు చాలావరకు ఎన్క్రిప్షన్ భద్రతతోనే కూడుకొని ఉంటాయి. అయితే కొన్ని పాత వర్షన్ పరిరకాల్లో ఇది ఉండకపోవచ్చు. ఒకవేళ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్, అంతకన్నా తక్కువ ఎండ్ ఫోన్‌ను వాడుతున్నట్టయితే ఎన్క్రిప్షన్ను సపోర్టు చేస్తుందో లేదో చూసుకోవాలి. ఇందుకోసం సెటింగ్స్ ద్వారా సెక్యూరిటీ విభాగంలోకి వెళ్లి ‘ఎన్‌క్రిప్ట్ ఫోన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇది పూర్తి కావటానికి గంట, అంతకన్నా ఎక్కువ సమయమే పట్టొచ్చు. కాబట్టి ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టుకొని ఉంచుకోవటం మంచిది. ఫోన్ ఎన్‌క్రిప్ట్ అయ్యాక యథావిధిగా ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవాలి.
యాప్స్ సాయం
సున్నితమైన సమాచారాన్ని పరికరం నుంచి శాశ్వతంగా తొలగించుకోవటానికి ఫైల్ ఎక్స్‌ప్లోరర్ లేదా ఫైల్ మేనేజర్ యాప్‌ల సాయమూ తీసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఉచిత ఫైల్ ఎక్స్ప్లోరర్లు చాలానే ఉన్నాయి. అయితే గూగుల్‌కు చెందిన ఫైల్ యాప్‌ను ఉపయోగించటం మంచిది. ఫైల్ యాప్ నుంచి ఫొటో లేదా వీడియోను ఎంచుకొని, ట్రాష్ బటన్‌ను నొక్కాలి. లేదూ మూడు చుక్కలను నొక్కి, డిలీట్‌ను ఎంచుకోవాలి. తర్వాత కన్ఫర్మ్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. ఎన్క్రిప్షన్ను సపోర్టు చేయని పాత వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్ల విషయంలో ఐష్రెడ్డర్, ష్రెడ్డిట్, డేటా ఎరేజర్ వంటి యాప్స్ వాడుకోవచ్చు. ఇవన్నీ ప్లేస్టోర్‌లో ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించటం చాలా తేలిక. అన్నీ పేటెంట్ కలిగి ఉన్నవే. సైనిక భద్రత ప్రమాణాలకు అనుగుణమైనవే.
పీసీతో మరింత సురక్షితంగా..
ఇంకా సురక్షితంగా ఆండ్రాయిడ్ ఫైళ్లను డిలీట్ చేయాలనుకుంటే విండోస్ పీసీ సాయం తీసుకోవచ్చు. యూఎస్బీ కేబుల్ ద్వారా ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయాలి. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ను తెరచి, ‘దిస్ డివైస్’ను ఎంచుకోవాలి. ఫోన్ డ్రైవ్ గుర్తు మీద డబుల్ క్లిక్ చేయాలి. కొన్నిసార్లు ఈ డ్రైవ్ ఖాళీగా ఉన్నట్టు కనిపించొచ్చు. ఇలాంటి సమయంలో సెటింగ్స్‌లోకి వెళ్లి కనెక్టెడ్ డివైస్ ద్వారా ఫైల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. డిలీట్ చేయాల్సిన ఫైళ్లను ఎంచుకొని తొలగించుకోవచ్చు. ఒకవేళ ఫొటోలు లేదా వీడియోలను డిలీట్ చేయాలనుకుంటే డీసీఐఎం ఫోల్డర్‌ను ఓపెన్ చేసి, కెమెరా విభాగంలోకి వెళ్లాలి. ఎంచుకున్న ఫొటో, వీడియో మీద రైట్ క్లిక్ చేయాలి. డిలీట్ ఆప్షన్‌ను ఎంచుకొని శాశ్వతంగా డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ అయిన ఫైళ్లు రీసైకిల్ బిన్‌లోకి చేరకుండానే కనుమరుగై పోతాయి.
జంక్ డేటా ఓవర్‌రైట్
తొలగిపోయిన డేటాను మరింత నిరుపయోగంగానూ మార్చుకోవటం మంచిది. కొత్త జంక్ డేటాతో ఓవర్‌రైట్ అయ్యేలా చేయటం ద్వారా దీన్ని సాధించొచ్చు. ఫ్యాక్టరీ రీసెట్ అయ్యాక ఎలాంటి గూగుల్ ఖాతాతో సైనిన్ కాకుండా పరికరాన్ని సెటప్ చేసుకోవాలి. ఫోన్ స్టోరేజీ అంతా నిండుకునేంతవరకు హై రెజల్యూషన్‌లో వీడియోలను రికార్డు చేయాలి. తర్వాత మరోసారి ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అప్పుడు డేటాను తిరిగి పొందటం దాదాపు అసాధ్యమై పోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెబ్క్యామే స్కానర్
డెస్క్‌టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్‌క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్‌లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్‌తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్‌టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్