కార్లకు జియోమోటివ్‌ జోష్‌!

రిలయెన్స్‌ జియో తొలిసారిగా వాహనాల కోసం ఆన్‌బోర్డ్‌ డయాగ్నస్టిక్స్‌ (ఓబీడీ) పరికరాన్ని ప్రవేశపెట్టింది. దీని పేరు జియోమోటివ్‌. ఇది ఎలాంటి కారునైనా చిటికెలో స్మార్ట్‌ వాహనంగా మార్చేస్తుంది. వాహన భద్రతతో పాటు డ్రైవింగ్‌ అనుభూతిని పెంచటం వరకూ రకరకాల ఫీచర్లు దీని సొంతం. చాలా వాహనాల్లో స్టీరింగ్‌ కింద ఓబీడీ పోర్టు ఉంటుంది.

Published : 08 Nov 2023 00:01 IST

రిలయెన్స్‌ జియో తొలిసారిగా వాహనాల కోసం ఆన్‌బోర్డ్‌ డయాగ్నస్టిక్స్‌ (ఓబీడీ) పరికరాన్ని ప్రవేశపెట్టింది. దీని పేరు జియోమోటివ్‌. ఇది ఎలాంటి కారునైనా చిటికెలో స్మార్ట్‌ వాహనంగా మార్చేస్తుంది. వాహన భద్రతతో పాటు డ్రైవింగ్‌ అనుభూతిని పెంచటం వరకూ రకరకాల ఫీచర్లు దీని సొంతం. చాలా వాహనాల్లో స్టీరింగ్‌ కింద ఓబీడీ పోర్టు ఉంటుంది. జియోమోటివ్‌నూ ఇందులో ఇమిడిపోయేలా రూపొందించారు. దీనిలోని ప్రత్యక్ష 4జీ జీపీఎస్‌ వెహికిల్‌ ట్రాకింగ్‌ ఫీచర్‌ వాహనం కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతుంది. ఇ-సిమ్‌తో కూడినది కావటం వల్ల ప్రస్తుత డేటా ప్లాన్‌తోనూ కనెక్ట్‌ అవుతుంది. ప్రత్యేకంగా సిమ్‌కార్డు కొనాల్సిన అవసరం లేదు. జియోఫెన్సింగ్‌ ఫీచర్‌తో మ్యాప్‌లో వర్చువల్‌ సరిహద్దులను నిర్ణయించుకోవచ్చు. ఇది కారు ఎక్కడుందో పర్యవేక్షించటానికి తోడ్పడుతుంది. వాహనం నిర్ణీత ప్రాంతాన్ని దాటినట్టయితే వెంటనే అలర్ట్‌ చేస్తుంది. జియోమోటివ్‌లో తెలివైన ఫీచర్లూ ఉన్నాయి. ఉదాహరణకు- హెల్త్‌ స్టేటస్‌ మానిటరింగ్‌ వాహనం బ్యాటరీ పర్సెంటేజీ, ఇంజిన్‌ లోడ్‌ వంటి వాటికి సబంధించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఏదైనా సమస్య ఉన్నట్టయితే డయాగ్నస్టిక్‌ ట్రబుల్‌ కోడ్‌ (డీటీసీ) హెచ్చరిస్తుంది. ఇక డ్రైవింగ్‌ ఫర్‌ఫార్మెన్స్‌ అనాలిసిస్‌ ఫీచరేమో డ్రైవింగ్‌ చేస్తున్న తీరు, అలవాట్లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. జియోమోటివ్‌లో యాంటీథెఫ్ట్‌, ప్రమాదాన్ని గుర్తించే ఫీచర్లూ ఉన్నాయి. నిజానికి ప్రస్తుతం చాలా కార్లు ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యే స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లతో వస్తున్నాయి. ఇవి లొకేషన్‌, ఇంజిన్‌ బాగోగులు, డ్రైవింగ్‌ తీరు వంటి వివరాలను అందిస్తున్నాయి. మరి పాత కారో, కొత్త బేస్‌ మోడల్‌ వాహనాన్నో నడుపుతున్నట్టయితే? ఇక్కడే జియోమోటివ్‌ ఉపయోగపడుతుంది. రీవైరింగ్‌ అవసరం లేకుండానే స్మార్ట్‌ ఫీచర్లను అందిస్తుంది. కొత్త డ్రైవింగ్‌ అనుభూతిని కలిగిస్తుంది. జియోమోటివ్‌ చిల్లర ధర రూ.11,999. అయితే రిలయెన్స్‌ డిజిటల్‌లో రూ.4,999కే లభిస్తుంది. తొలి సంవత్సరం సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం. అనంతరం ఏడాదికి రూ.599 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని