వెబ్‌ పేజీని పీడీఎఫ్‌గా మార్చాలంటే?

వెబ్‌ పేజీని చూస్తాం. బాగుందనిపిస్తుంది. కానీ అప్పుడు చదవటం కుదరకపోవచ్చు. ఆఫ్‌లైన్‌లో చదవాలనీ  అనిపించొచ్చు. పేజీ మొత్తాన్ని పీడీఎఫ్‌గా సేవ్‌ చేసుకుంటే ఇది సాధ్యమే.

Published : 15 Nov 2023 01:27 IST

వెబ్‌ పేజీని చూస్తాం. బాగుందనిపిస్తుంది. కానీ అప్పుడు చదవటం కుదరకపోవచ్చు. ఆఫ్‌లైన్‌లో చదవాలనీ  అనిపించొచ్చు. పేజీ మొత్తాన్ని పీడీఎఫ్‌గా సేవ్‌ చేసుకుంటే ఇది సాధ్యమే. ఆధునిక విండోస్‌ వర్షన్లు డిఫాల్ట్‌గా డాక్యుమెంట్‌ను పీడీఎఫ్‌ రూపంలో ప్రింట్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాయి. నిజానికిది ప్రింట్‌ కాదు గానీ పీడీఎఫ్‌గా సేవ్‌ అవుతుంది. ఇది వెబ్‌ పేజీలకూ వర్తిస్తుంది. పేజీని ఓపెన్‌ చేశాక కింది వరకూ స్క్రోల్‌ చేసి టెక్స్ట్‌, ఇమేజెస్‌ అన్నీ లోడ్‌ అయ్యాక ప్రింట్‌ ఆప్షన్‌ను ఉపయోగించుకోవటం మంచిది. ఒక్కో బ్రౌజర్‌ ఒక్కోలా ఈ అవకాశం కల్పిస్తాయి. ఉదాహరణకు- క్రోమ్‌లో మెనూ గుర్తు ద్వారా ప్రింట్‌ ఆప్షన్‌లోకి వెళ్లి సేవ్‌ యాజ్‌ పీడీఎఫ్‌ను ఎంచుకోవాలి. కావాలంటే లే అవుట్‌ను ల్యాండ్‌స్కేప్‌లోకి మార్చుకోవచ్చు కూడా. బ్యాక్‌గ్రౌండ్‌ గ్రాఫిక్స్‌ను ఎంచుకుంటే అన్ని ఇమేజ్‌లూ సరిగ్గా సేవ్‌ అవుతాయి. స్కేల్‌ విలువను మార్చుకోవటం ద్వారా హయ్యర్‌ వాల్యూలో డాక్యుమెంట్‌ లేఅవుట్‌లో వెబ్‌ పేజీ స్థిరపడుతుంది. సేవ్‌ అయిన పేజీ అచ్చం వెబ్‌ మాదిరిగానే కనిపిస్తుంది. ఒక్కో షీటుకు ఎన్ని పేజీలు ఉండాలో కూడా నిర్ణయించుకోవచ్చు. ఫైర్‌ఫాక్స్‌లోనైతే మరింత మెరుగైన సెటింగ్స్‌ ఆప్షన్లూ ఉంటాయి. పీడీఎఫ్‌ మార్పు కోసం ఎక్స్‌టెన్షన్ల సాయమూ తీసుకోవచ్చు. క్రోమ్‌కు పీడీఎఫ్‌ మేజ్‌.. మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, ఫైర్‌ఫాక్స్‌ కోసమైతే ప్రింట్‌ ఫ్రెండ్లీ అండ్‌ పీడీఎఫ్‌ వాడుకోవచ్చు. ఇవేవీ వద్దనుకుంటే https://webtopdf.com/  వంటి ఆన్‌లైన్‌ కన్వర్షన్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు