Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లు

గూగుల్‌ మ్యాప్స్‌ లొకేషన్‌ డేటా నియంత్రణకు కొత్త మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. మ్యాప్స్‌లో కనిపించే నీలం చుక్క మనం ఎక్కడున్నామో తెలుపుతుంది కదా. ఇకపై దీన్ని పార్కింగ్‌ సేవ్‌, షేర్‌ యువర్‌ లొకేషన్‌ కోసం షార్ట్‌కట్‌గానూ వాడుకోవచ్చు. డివైస్‌ లొకేషన్‌, లొకేషన్‌ హిస్టరీ ఆప్షన్లు ఆన్‌లో ఉన్నాయా?

Updated : 27 Dec 2023 08:18 IST

గూగుల్‌ మ్యాప్స్‌ (Google Maps) లొకేషన్‌ డేటా నియంత్రణకు కొత్త మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. మ్యాప్స్‌లో కనిపించే నీలం చుక్క మనం ఎక్కడున్నామో తెలుపుతుంది కదా. ఇకపై దీన్ని పార్కింగ్‌ సేవ్‌, షేర్‌ యువర్‌ లొకేషన్‌ కోసం షార్ట్‌కట్‌గానూ వాడుకోవచ్చు. డివైస్‌ లొకేషన్‌, లొకేషన్‌ హిస్టరీ ఆప్షన్లు ఆన్‌లో ఉన్నాయా? ఆఫ్‌లోనా? అనేదీ తెలుసుకోవచ్చు. సాధారణంగా గూగుల్‌ మ్యాప్స్‌ను వాడుతున్నప్పుడు లొకేషన్‌ హిస్టరీ డిఫాల్ట్‌గా ఆఫ్‌ అవుతుంది. ఒకవేళ దీన్ని ఆన్‌ చేసుకుంటే అదంతా క్లౌడ్‌లో సేవ్‌ అవుతుంది. దీన్ని టైమ్‌లైన్‌ ఫీచర్‌ ద్వారా చూసుకోవచ్చు. ఇందులోనూ గూగుల్‌ పెద్ద మార్పు తీసుకొస్తోంది. తదుపరి అప్‌డేట్‌తో డేటా మొత్తం క్లౌడ్‌లో కాకుండా పరికరంలోనే సేవ్‌ అవుతుంది. కావాలనుకుంటే తమకు తాము క్లౌడ్‌లో సేవ్‌ చేసుకునే వీలు కల్పించారు. లొకేషన్‌ హిస్టరీ డిఫాల్ట్‌గా సేవ్‌ అయ్యే కాలాన్నీ గూగుల్‌ తగ్గించేస్తోంది. ఇప్పటివరకు 18 నెలల తర్వాత లొకేషన్‌ హిస్టరీ తనకుతానే డిలీట్‌ అవుతుంది. ఇది త్వరలో 3 నెలలకే పరిమితం కానుంది. అంటే మూడు నెలల కన్నా పాత సమాచారం డిలీట్‌ అవుతుందన్నమాట. ఎక్కువకాలం టైమ్‌లైన్‌లో జ్ఞాపకాలను సేవ్‌ చేసుకోవాలనుకుంటే పొడిగించుకునే వీలుంటుందనుకోండి. కొత్త మార్పులు క్రమంగా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాలకు అందుబాటులోకి రానున్నాయి. అప్‌డేట్‌ అందుబాటులోకి రాగానే ఆయా ఫోన్లకు నోటిఫికేషన్‌ వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని