కాంతితో క్యాన్సర్‌ ఖతం!

క్యాన్సర్‌ కణాలను అంతం చేయటానికి డాక్టర్లు ఇటీవల ఓ వినూత్న ప్రక్రియను వాడుకున్నారు. ఇది ప్రయోగశాలలో 99% వరకూ క్యాన్సర్‌ కణాలను నిర్మూలించటం విశేషం. ఇంతకీ ఇందుకు ఉపయోగపడిన సాధమేంటో తెలుసా? నియర్‌-ఇన్‌ఫ్రారెడ్‌ కాంతి! ఈ రకం పరారుణ కాంతి శరీరం లోపలికి చొచ్చుకెళ్లగలదు మరి.

Published : 03 Jan 2024 00:10 IST

క్యాన్సర్‌ కణాలను అంతం చేయటానికి డాక్టర్లు ఇటీవల ఓ వినూత్న ప్రక్రియను వాడుకున్నారు. ఇది ప్రయోగశాలలో 99% వరకూ క్యాన్సర్‌ కణాలను నిర్మూలించటం విశేషం. ఇంతకీ ఇందుకు ఉపయోగపడిన సాధమేంటో తెలుసా? నియర్‌-ఇన్‌ఫ్రారెడ్‌ కాంతి! ఈ రకం పరారుణ కాంతి శరీరం లోపలికి చొచ్చుకెళ్లగలదు మరి. ఇంతకీ క్యాన్సర్‌ కణాలను ఇదెలా చంపుతుంది? కంపింపజేయటం ద్వారా. క్యాన్సర్‌ కణాల పైపొరలు ఛిద్రమయ్యేవరకూ అలా కంపించేలా చేస్తూనే ఉంటుంది. ఎముకల్లో, అవయవాల్లో తలెత్తే క్యాన్సర్లకు శస్త్రచికిత్స రహిత చికిత్సల దిశగా ఇది ద్వారాలను తెరుస్తుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని