మొదటికి.. చివరికి

వర్డ్‌ప్యాడ్‌లోనో, గూగుల్‌ డాక్స్‌లోనో ఓ పెద్ద డాక్యుమెంట్‌ చదువుతున్నారు. మధ్యలో ఎక్కడో ఉన్నారు. హెడ్డింగ్‌ పేరు మరచిపోయారు. పైకి స్క్రోల్‌ చేసుకుంటూ వెళ్తే తెలుస్తుంది కానీ వెంటనే తెలుసుకోవాలంటే? విండోస్‌లోనైతే కంట్రోల్‌, హోం పేజీలను కలిపి నొక్కితే డాక్యుమెంటు మొదటికి చేరుకోవచ్చు.

Published : 03 Jan 2024 00:10 IST

వర్డ్‌ప్యాడ్‌లోనో, గూగుల్‌ డాక్స్‌లోనో ఓ పెద్ద డాక్యుమెంట్‌ చదువుతున్నారు. మధ్యలో ఎక్కడో ఉన్నారు. హెడ్డింగ్‌ పేరు మరచిపోయారు. పైకి స్క్రోల్‌ చేసుకుంటూ వెళ్తే తెలుస్తుంది కానీ వెంటనే తెలుసుకోవాలంటే? విండోస్‌లోనైతే కంట్రోల్‌, హోం పేజీలను కలిపి నొక్కితే డాక్యుమెంటు మొదటికి చేరుకోవచ్చు. అలాగే కంట్రోల్‌, ఎండ్‌ బటన్లు కలిపి నొక్కితే చివరి లైను కనిపిస్తుంది. మ్యాక్‌లోనైతే కమాండ్‌, హోం మీటలను నొక్కి మొదలుకు.. కమాండ్‌, ఎండ్‌ బటన్లను నొక్కి చివరికి చేరుకోవచ్చు.

కంప్యూటర్‌ సెర్చ్‌ బార్‌తో ఫైళ్లు వెతకటం మామూలే. కానీ దీంతో డాక్యుమెంట్లలో నిర్దిష్ట సమాచారాన్ని కూడా వెతకొచ్చు. అవసరమైన పదాన్నో, వాక్యాన్నో సెర్చ్‌ బార్‌లో టైప్‌ చేసి ఎంటర్‌ చేస్తే.. డాక్యుమెంట్లలో వాటిని పసుపురంగులో కనిపించేలా చేస్తుంది. అవసరమైన డాక్యుమెంటును ఓపెన్‌ చేస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని