టాస్క్‌.. ఆటోమేటిక్‌!

వారానికోసారి డిస్క్‌ క్లీనప్‌ చేయటం, నిర్ణీత సమయానికి ఈమెయిల్‌ పంపటం వంటి తరచూ చేసే పనులు ఆటోమేటిగ్గా జరిగితే బాగుండునని చాలాసార్లు అనిపిస్తుంటుంది.

Published : 24 Jan 2024 00:13 IST

వారానికోసారి డిస్క్‌ క్లీనప్‌ చేయటం, నిర్ణీత సమయానికి ఈమెయిల్‌ పంపటం వంటి తరచూ చేసే పనులు ఆటోమేటిగ్గా జరిగితే బాగుండునని చాలాసార్లు అనిపిస్తుంటుంది. దీనికి విండోస్‌ టాస్క్‌ షెడ్యూలర్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇదో డిఫాల్ట్‌ యుటిలిటీ. విండోస్‌ సెర్చ్‌ బాక్స్‌లో టాస్క్‌ షెడ్యూలర్‌ అని టైప్‌ చేస్తే కనిపిస్తుంది. ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి ‘క్రియేట్‌ బేసిస్‌ టాస్క్‌’ మీద క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత వచ్చే సందేశాలను  అనుసరించి, చేయాల్సిన పనికి పేరు పెట్టుకోవాలి. ఆ పని ఎప్పుడు కావాలో.. అంటే సమయం, రోజు, వారం వంటివి నిర్ణయించుకోవాలి. ఏ పని చేయాలో ఎంచుకుంటే సరి. ఆ సమయానికి ఆ పనిని ఆటోమేటిక్‌గా చేసి పెడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని