అన్ని విండోలూ ఒకేసారి మినిమైజ్‌

డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ మీద ఎన్నో వెబ్‌సైట్లు, ఫైళ్లు ఓపెన్‌ చేస్తుంటాం. అవసరం లేని విండోస్‌ను మినిమైజ్‌ చేస్తుంటాం కూడా. కానీ అన్నింటినీ ఒకేసారి మినిమైజ్‌ చేయాలంటే? విండోస్‌ కీ, ఎం మీటలను కలిపి నొక్కితే సరి.

Updated : 24 Jan 2024 04:49 IST

డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ మీద ఎన్నో వెబ్‌సైట్లు, ఫైళ్లు ఓపెన్‌ చేస్తుంటాం. అవసరం లేని విండోస్‌ను మినిమైజ్‌ చేస్తుంటాం కూడా. కానీ అన్నింటినీ ఒకేసారి మినిమైజ్‌ చేయాలంటే? విండోస్‌ కీ, ఎం మీటలను కలిపి నొక్కితే సరి. అన్నీ చిటికెలో మినిమైజ్‌ అవుతాయి. విండోస్‌, డి బటన్లను కలిపి నొక్కినా ఇదే ఫలితం కనిపిస్తుంది. విండోస్‌ 10, విండోస్‌ 11తో పనిచేసే పరికరాల్లో దీనికి మరో సదుపాయమూ ఉంది. కాకపోతే ఇది అదృశ్యంగా ఉంటుంది. టాస్క్‌బార్‌లో కుడివైపు చివరి భాగానికి కర్సర్‌ను తీసుకొచ్చినప్పుడూ నిట్టనిలువు గీత ఒకటి కనిపిస్తుంది. దీని మీద క్లిక్‌ చేస్తే ఓపెన్‌ చేసిన అన్ని విండోలూ ఒకేసారి మినిమైజ్‌ అవుతాయి. ఈ నిలువు గీతను మళ్లీ క్లిక్‌ చేస్తే అన్నీ యథాస్థితికి వచ్చేస్తాయి.

  •  విండోస్‌ 10 పరికరంలో టాస్క్‌బార్‌తోనూ అన్ని విండోస్‌నూ ఒకేసారి మినిమైజ్‌ చేయొచ్చు. టాస్క్‌బార్‌ మీద రైట్‌ క్లిక్‌ చేసి ‘షో ద డెస్క్‌టాప్‌’ను ఎంచుకుంటే ఓపెన్‌ అయిన విండోస్‌ మినిమైజ్‌ అవుతాయి. తిరిగి రైట్‌ క్లిక్‌ చేసి షో ఓపెన్‌ విండోస్‌ను క్లిక్‌ చేస్తే మళ్లీ మ్యాగ్జిమైజ్‌ అవుతాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని