స్పోటిఫై డేలిస్ట్‌

అతిపెద్ద మ్యూజిక్‌ లైబ్రరీ, ఆకట్టుకునే యూజర్‌ ఇంటర్ఫేస్‌తో స్పోటిఫై ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఇష్టమైన సంగీత వారధిగా మారింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ మరింతగా ఆకట్టుకుంటూ వస్తోంది. ఇందులో డేలిస్ట్‌ అనే ఫీచర్‌ కూడా ఉంది. ఇది వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా పాటలు, సంగీత ట్రాక్‌లను జోడిస్తుంది.

Published : 31 Jan 2024 00:05 IST

తిపెద్ద మ్యూజిక్‌ లైబ్రరీ, ఆకట్టుకునే యూజర్‌ ఇంటర్ఫేస్‌తో స్పోటిఫై ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఇష్టమైన సంగీత వారధిగా మారింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ మరింతగా ఆకట్టుకుంటూ వస్తోంది. ఇందులో డేలిస్ట్‌ అనే ఫీచర్‌ కూడా ఉంది. ఇది వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా పాటలు, సంగీత ట్రాక్‌లను జోడిస్తుంది. రోజంతా వీటిని మారుస్తుంటుంది కూడా. ఇది మనం వినే సంగీతాన్ని విశ్లేషించి, రోజులో ఆయా సమయాలకు తగిన ట్రాక్‌లను జత చేస్తుంది. యూజర్లు ఈ జాబితాను స్నేహితులు, కుటుంబ సభ్యులతో సేవ్‌, షేర్‌ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇదింకా మనదేశంలో అందు బాటులోకి రాలేదు. త్వరలోనే రావొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని