హెచ్‌పీ నుంచి ఏఐ ల్యాప్‌టాప్‌లు

ప్రస్తుతం పీసీ అంటే పర్సనల్‌ కంప్యూటర్‌ మాత్రమే కాదు.. వ్యక్తిగత సహాయకుడు కూడా. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా పనిచేయటం అనివార్యమైన తరుణంలో కొత్తరకం ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది.

Updated : 07 Feb 2024 00:16 IST

ప్రస్తుతం పీసీ అంటే పర్సనల్‌ కంప్యూటర్‌ మాత్రమే కాదు.. వ్యక్తిగత సహాయకుడు కూడా. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా పనిచేయటం అనివార్యమైన తరుణంలో కొత్తరకం ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా యువతరం అవసరాలు రోజురోజుకీ మారుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని హెచ్‌పీ సంస్థ స్పెక్టర్‌ ఎక్స్‌360 శ్రేణిలో కొత్త ల్యాప్‌టాప్‌లను పరిచయం చేసింది. వీటి సైజు 14, 16 అంగుళాలు. మరింత వేగంగా పని చేయటానికి, భద్రత కోసం వీటిల్లో స్మార్ట్‌ కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లనూ జోడించారు. ఏఐ వర్క్‌లోడ్స్‌ సాఫీగా, అంతరాయం లేకుండా పనిచేయటానికి తొలిసారి న్యూరల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (ఎన్‌పీయూ) అమర్చారు. సీపీయూ, జీపీయూ ఎన్‌పీయూతో పాటు ఎన్‌విడియా స్టుడియో కూడా వీటిల్లో ఉంటుంది. అధునాతన ఏఐ పరిజ్ఞానంతో కూడి ఉండటం వల్ల వీడియో ఎడిటింగ్‌ త్వరగా పూర్తవుతుంది. కంటెంట్‌ను తేలికగా  క్రియేట్‌ చేయొచ్చు. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 7 ప్రాసెసర్లు గల ఇవి హైబ్రిడ్‌ వర్క్‌కల్చర్‌కు అతికినట్టుగా సరిపోతాయి. స్పెక్టర్‌ ఎక్స్‌360 ల్యాప్‌టాప్‌లకు రాత్రీ పగలూ స్పష్టంగా మాట్లాడుకోవటానికి తేలికైన హార్డ్‌వేర్‌తో కూడిన 9 ఎంపీ కెమెరా వంటి సదుపాయాలెన్నో ఉన్నాయి. భద్రత కోసం వినూత్న ఏఐ చిప్‌ అమర్చటం విశేషం. ల్యాప్‌టాప్‌ దూరంగా ఉన్నప్పుడు లాక్‌ అవటం, దగ్గరకు వచ్చినప్పుడు ఓపెన్‌ కావటం, ఎవరైనా స్నూపింగ్‌ చేస్తుంటే అప్రమత్తం చేయటం దీని ప్రత్యేకత. 2.8కే ఓఎల్‌డీ తెర, ఐమ్యాక్స్‌ ఎన్‌హ్యాన్స్‌డ్‌ సర్టిఫికేషన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. విండోస్‌ ఆధారిత 16 అంగుళాల పరికరం ప్రపంచంలోనే అతిపెద్ద హెపాటిక్‌ టచ్‌ప్యాడ్‌తోనూ వస్తోంది. స్పెక్టర్‌ ఎక్స్‌360 14 అంగుళాల ల్యాప్‌టాప్‌ నైట్‌ఫాల్‌ బ్లాక్‌, స్లేట్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 1,64,999. నైట్‌ఫాల్‌ బ్లాక్‌ రంగులో లభించే 16 అంగుళాల పరికరం ప్రారంభ ధర రూ.1,79,999.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని