గూగుల్‌ మ్యాప్స్‌తో గాలి నాణ్యత

గాలి నాణ్యత మన ఆరోగ్యం మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కలుషితమైన గాలి ఉబ్బసం వంటి రకరకాల సమస్యలకు దారితీస్తుంది.

Published : 07 Feb 2024 00:22 IST

గాలి నాణ్యత మన ఆరోగ్యం మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కలుషితమైన గాలి ఉబ్బసం వంటి రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. ఇది గాలిలో రకరకాల కాలుష్య కారకాల మోతాదులను తెలియజేస్తుంది. ఆయా పట్టణాల్లో గాలి నాణ్యతను తెలుసుకోవటానికి గూగుల్‌ మ్యాప్స్‌ తేలికైన సాధనంగా ఉపయోగపడుతుంది.

  •  స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. కంప్యూటర్‌లోనైతే గూగుల్‌ మ్యాప్స్‌ వెబ్‌సైట్‌ను తెరవాలి.
  •  తెర పైభాగాన కనిపించే సెర్చ్‌ బార్‌లో ప్రస్తుత లొకేషన్‌ లేదా ప్రాంతాన్ని టైప్‌ చేసి, ఎంటర్‌ చేయాలి.
  •  మ్యాప్‌లో ఎర్రగా కనిపించే లొకేషన్‌ మీద తాకాలి. మ్యాప్‌ అడుగున ఎడమవైపున లేయర్స్‌ విభాగం ఉంటుంది. దీన్ని తాకితే టెర్రయిన్‌, ట్రాఫిక్‌, ట్రాన్సిట్‌, బైకింగ్‌, మోర్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. మోర్‌ మీద క్లిక్‌ చేసి ‘ఎయిర్‌ క్వాలిటీ’ని ఎంచుకోవాలి. ఇది ఆయా ప్రాంతాల్లో గాలి నాణ్యత మోతాదును చూపిస్తుంది. దీన్ని తేలికగా అర్థం చేసుకోవటానికి గూగుల్‌ వేర్వేరు రంగుల్లో నాణ్యతను తెలియజేస్తుంది. ఆకుపచ్చ రంగు మంచి గాలి నాణ్యతకు సూచిక. ఎరుపు రంగు అయితే ఏమాత్రం బాగోలేదని అర్థం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని